Share News

ఇద్దరు ఏపీవోల సస్పెన్సన్‌

ABN , Publish Date - Feb 06 , 2024 | 10:31 PM

నర్సరీల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇద్దరు ఏపీవోలను విధుల నుంచి తాత్కాలికంగా కలెక్టర్‌ నారాయణరెడ్డి తొలగించారు.

 ఇద్దరు ఏపీవోల సస్పెన్సన్‌

వికారాబాద్‌, ఫిబ్రవరి 6 : నర్సరీల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇద్దరు ఏపీవోలను విధుల నుంచి తాత్కాలికంగా కలెక్టర్‌ నారాయణరెడ్డి తొలగించారు. మంగళవారం వివిధ పనుల పురోగతిపై కలెక్టర్‌ సమీక్ష సమావేశం నిర్వహించారు. 2023-24గాను మండలాల వారీగా నర్సరీల నిర్వహణపై లక్ష్యాలను కేటాయించగా నిర్లక్ష్యంగా వహించిన పూడూరు మండలం ఏపీవో యస్‌. రాములు, కుల్కచర్ల ఏపీవో వెంకటేశ్వర్‌ గౌడ్‌లను కలెక్టర్‌ విధుల నుంచి తాత్కాలికంగా తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వారంలో రోజుల్లో ఎంపీడీవోకు వివరణ అందజేయాలని, లేనిపక్షంలో తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు.

Updated Date - Feb 06 , 2024 | 10:31 PM