ఘట్‌కేసర్ సబ్‌రిజిస్ట్రార్ సస్పెన్షన్
ABN , Publish Date - Aug 14 , 2024 | 12:02 AM
ఘట్‌కేసర్‌కు నూతనంగా వచ్చిన సబ్‌రిజిస్ట్రార్ హన్మంతరావుసస్పెండ్ అయ్యారు. గత సోమవారం పటాన్‌చెరు నుంచి ఆయన ఘట్‌కేసర్‌కు బదిలీపై వచ్చారు.
విధుల్లో చేరిన నాలుగు రోజులకే..
పటాన్‌చెరులో జరిగిన కేసులో హన్మంతరావుపై చర్యలు
ఘట్‌కేసర్, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి): ఘట్‌కేసర్‌కు నూతనంగా వచ్చిన సబ్‌రిజిస్ట్రార్ హన్మంతరావుసస్పెండ్ అయ్యారు. గత సోమవారం పటాన్‌చెరు నుంచి ఆయన ఘట్‌కేసర్‌కు బదిలీపై వచ్చారు. రెండు రోజులు ఆలస్యంగా ఘట్‌కేసర్ సబ్‌రిజిస్ట్రార్‌గా పదవి బాధ్యతలు చేపట్టారు. నాలుగు రోజులపాటు (గత శుక్రవారం వరకు) ఇక్కడ సబ్‌రిజిస్ట్రార్ పని చేశారు. అయితే ఆయనను శుక్రవారం ఉద్యోగం నుంచి సస్పెండ్ చేస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేసిన విషయం ఆలస్యంగా మంగళవారం వెలుగుచూసింది. సబ్‌రిజిస్ట్రార్ హన్మంతరావు పటాన్‌చెరులో ఉన్నప్పుడు ఓవ్యక్తి నుంచి లంచం తీసుకున్న కేసులో అధికారులు విచారణ జరిపి ఆయనను సస్పెండ్ చేసినట్లు సమాచారం. కాగా ఘట్‌కేసర్‌లో కేవలం నాలుగురోజుల పాటే సబ్ రిజిస్ట్రార్‌గా పనిచేసిన ఆయన ఇక్కడి డాక్యుమెంట్ రైటర్లను వివిధ రకాలుగా ఇబ్బందులకు గురి చేశాడని పలువురు వాపోయారు. కేవలం నాలుగు రోజులకు పాత కేసులో సస్పెండ్ అయిన సబ్‌రిజిస్ట్రార్ ఉదంతం చర్చనీయాంశంగా మారింది.