Share News

ఇసుక రీచ్‌ కోసం అధికారుల సర్వే

ABN , Publish Date - Dec 31 , 2024 | 12:47 AM

నార్కట్‌పల్లి మండలంలోని అమ్మనబోలు వద్ద మూసీ వా గులో ఇసుక రీ చ్‌ ఏర్పాటుకు అధికారుల బృం దం సోమవారం క్షేత్ర స్థాయి సర్వే నిర్వహించారు.

 ఇసుక రీచ్‌ కోసం అధికారుల సర్వే
ఇసుక రీచ్‌ ఏర్పాటుకు సర్వే చేస్తున్న అధికారులు

ఇసుక రీచ్‌ కోసం అధికారుల సర్వే

నార్కట్‌పల్లి, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): నార్కట్‌పల్లి మండలంలోని అమ్మనబోలు వద్ద మూసీ వా గులో ఇసుక రీ చ్‌ ఏర్పాటుకు అధికారుల బృం దం సోమవారం క్షేత్ర స్థాయి సర్వే నిర్వహించారు. స్థానికులకు ఉపాధి కల్పన, అక్రమ ఇసుక రవా ణాకు చెక్‌ పెట్టడం, గ్రామ పంచాయితీకి ఆదాయం సమకూర్చుకునే వనరుగా మూసీ వాగులో ఇసుక రీచ్‌ ఏర్పాటు చేయాలని కోరుతూ గ్రామ మాజీ ఎంపీటీసీ కొంపల్లి సైదులు, కలెక్టర్‌ ఇలా త్రిపాఠికి ఇటీవల వినతిపత్రం అందజేశారు. ఈ క్రమంలో కలెక్టర్‌ ఆదేశాల మేరకు భూగర్భజల శాఖ అధికారి రజని, ఏజీ మైన్స్‌ ఆర్‌.బాలు, తహసీల్దార్‌ వెంకటేశ్వరరావు, ఆర్‌ఐ తరుణ్‌, ఏఆర్‌ఐ భవాని, సర్వేయర్‌ శ్రీనివాస్‌, ఐబీ ఏఈ ఆంజనేయులు బృందం సర్వే నిర్వహించింది. మూసీ వాగులో అమ్మనబోలు గ్రామం నుంచి ఏడుమోటలబావి గ్రామం వరకు ఇసుక సేకరణకు 8 ఎకరాలను ప్రాథమికంగా గుర్తించారు. రీచ్‌గా గుర్తించిన చోట ఇసుక లభ్యతకు గల అవకాశాలను వివరిస్తూ సర్వే బృందం కలెక్టర్‌కు నివేదిక అందించనుంది. అధికారుల బృందం వెంట మాజీ ఎంపీటీసీ కొంపల్లి సైదులు, గ్రామస్థులు ఉన్నారు.

Updated Date - Dec 31 , 2024 | 12:47 AM