Share News

ప్రతి చేనేత కార్మికుడిని ఆదుకుంటా

ABN , Publish Date - Jan 14 , 2024 | 12:15 AM

మునుగోడు నియోజకవర్గంలో ఉన్న ప్రతీ చేనేత కార్మికుడిని ఆదుకుంటానని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అ న్నారు.

ప్రతి చేనేత కార్మికుడిని ఆదుకుంటా
సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి

ప్రతి చేనేత కార్మికుడిని ఆదుకుంటా

ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి

గట్టుప్పల మండలంలో స్టాండ్‌ మగ్గాల పంపిణీ

గట్టుప్పల, మర్రిగూడ, జనవరి 13: మునుగోడు నియోజకవర్గంలో ఉన్న ప్రతీ చేనేత కార్మికుడిని ఆదుకుంటానని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అ న్నారు. ఎన్నికల హామీలో భాగంగా ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి శనివారం చేనేత, జౌళిశాఖ ఆధ్వర్యంలో గుంట మగ్గాల స్థానంలో స్టాండ్‌ మగ్గాలు పంపిణీ చేశా రు. గట్టుప్పల మండల పరిధిలోని గట్టుప్పల, తేరట్‌పల్లి, కమ్మగూడెం గ్రామ చే నేత కార్మికులైన 493 మందికి స్టాండ్‌ మగ్గాలను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేనేత కార్మికులను పూర్తిగా విస్మరిం చి, చేనేత సంఘాలను నిర్వీర్యం చేసిందని అన్నారు. రాష్ట్రంలోనే అత్యధికంగా 18 వేల చేనేత కార్మికులు ఉన్న నియోజకవర్గంలోని నేత కార్మికులకు అందుబాటులో ఉంటి ఆదుకునే బాధ్యత తనదేనని హామీ ఇచ్చారు. కేసీఆర్‌ రాష్ర్టాన్ని దే ళ్లు పాలించి తాగుబోతుల తెలంగాణగా మార్చారని ఎద్దేవా చేశారు. గట్టుప్పల మండలంలో యుద్ధ ప్రాతిపదికన రోడ్ల నిర్మాణం చేయిస్తానని, ప్రజలకు నష్టం కలిగించే ఫార్మా కంపెనీలను తొలగిస్తామని అన్నారు. కార్యక్రమంలో తహసీల్దా ర్‌ లావణ్య, జడ్పీటీసీ కర్నాటి వెంకటేశం, ఎంపీపీ పల్లె కల్యాణి, సర్పంచ ఇడెం రోజా, నాయకులు పున్న కైలాష్‌ నేత, నారబోయిన రవి, చెరుపల్లి సత్యనారాయ ణ, దండు యాదగిరి, నామని జగన్నాధం, గోపాల్‌ పాల్గొన్నారు.

మునుగోడు ఎమ్మెల్యేగా గెలుపొందిన రాజగోపాల్‌రెడ్డి మొట్టమొదటి సా రిగా మర్రిగూడకు వచ్చిన సందర్భంగా శనివారం కాంగ్రెస్‌ కార్యకర్తలు అధిక సంఖ్యలో పుష్పగుచ్ఛాలు అందజేసి ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మె ల్యే రాజగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ పార్లమెంట్‌ ఎన్నికలు వస్తున్నందున కార్యకర్తలు సిద్ధం కావాలని సూచించారు. భువనగిరి పార్లమెంట్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిని ఎంపీగా గెలిపించేందుకు కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ మండల వర్కింగ్‌ ప్రసిడెంట్‌ నక్క తిరుపతయ్య, మాజీ జడ్పీటీసీ మేదరి యాదయ్య, శ్రీరాందాసు శ్రీనివాస్‌, ఎంపీటీసీలు శ్రీశైలం, ప్రసాద్‌, సర్పంచులు పాక నగేష్‌, రవీందర్‌రావు, శ్రీనివా్‌సరెడ్డి, అజితరెడ్డి, బాలయ్య, హనుమంతు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 14 , 2024 | 12:15 AM