Share News

కళాకారులకు అండగా ఉంటా

ABN , Publish Date - Apr 05 , 2024 | 12:07 AM

కళాకారులకు అండగా నిలుస్తానని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు. పట్టణంలోని మినీరవీంద్రభారతి ఆడిటోరియంలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, సాంస్కృతిక కళాకేంద్ర సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జాతీయస్థాయి నాటక పోటీలు గు రువారం ముగిశాయి.

 కళాకారులకు అండగా ఉంటా
సాంఘిక విభాగంలో ప్రథమస్థానంలో నిలిచిన ‘నాన్న నేనొచ్చేస్తా’ నాటిక కళాకారులకు బహుమతి అందజేస్తున్న ఎమ్మెల్యే బీఎల్‌ఆర్‌, మాజీ ఎమ్మెల్యే రంగారెడ్డి

కళాకారులకు అండగా ఉంటా

ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి

ముగిసిన జాతీయస్థాయి నాటక పోటీలు

మిర్యాలగూడ టౌన, ఏప్రిల్‌ 4: కళాకారులకు అండగా నిలుస్తానని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు. పట్టణంలోని మినీరవీంద్రభారతి ఆడిటోరియంలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, సాంస్కృతిక కళాకేంద్ర సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జాతీయస్థాయి నాటక పోటీలు గు రువారం ముగిశాయి. కార్యక్రమానికి ఎమ్మెల్యే బీఎల్‌ఆర్‌ హాజరై మాట్లా డారు. మిర్యాలగూడలో జాతీయస్థాయి పోటీలు నిర్వహించడం హర్షనీయమన్నారు. ఉభయ రాష్ట్రాలకు చెందిన కళాకారులు ఇరు విభాగాల్లో ప్రదర్శించిన నటనాచాతుర్యం అద్భుతంగా ఉందన్నారు. ఆడిటోరియంలో అ సంపూర్తిగా ఉన్న పనులను వెనువెంటనే పూర్తి చేయిస్తానని ఆయన హా మీ ఇచ్చారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి మాట్లాడు తూ ఈ ప్రాంత ప్రజలకు ఆహ్లాదం పంచేందుకు తన హయాంలోనే మినీ రవీంద్రభారతి నిర్మాణానికి చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. అనంతరం ఉత్తమ ప్రదర్శనలు, ఉత్తమ నటులు, సాంకేతిక నిపుణులకు బహుమతు లు అందజేశారు. కార్యక్రమంలో కళాకేంద్ర వ్యవస్థాపకుడు తడకమళ్ల పూ ర్ణచందర్‌, అధ్యక్షుడు బోయినపల్లి భుజంగరావు, పులి కృష్ణమూర్తి, పుల్లాభ ట్ల లక్ష్మీనారాయణశర్మ, గ్యార సాయిలు, పరిమి రామావతారం, మామిడా ల ఉపేందర్‌, పయ్యావుల శ్రీనివాసరావు, రాంరంగారావు, బాబురావు, రాఘవయ్య, బాపనయ్య, వేణు, వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు. పద్య విభాగంలో విజయవాడకు చెంది డాక్టర్‌ రామన ఫౌండేషన వారి శ్రీసాయిబాబా నాట్యమండలి బృంద కళాకారులు ప్రదర్శించిన ‘మాధవవర్మ’ నాటికకు ప్రథమ బహుమతి దక్కింది. సాంఘిక విభాగంలో గుంటూరుకు చెందిన శ్రీఅమృత లహరీ థియేటర్‌ ఆర్ట్స్‌ కళాకారుల ఆధ్వర్యంలో ‘నాన్న నేనొచ్చేస్తా’ నాటికకు ప్రథమ బహుమతి దక్కింది.

Updated Date - Apr 05 , 2024 | 12:07 AM