Share News

హైకోర్టు జడ్జిగా సుజయ్‌ పాల్‌ ప్రమాణ స్వీకారం

ABN , Publish Date - Mar 27 , 2024 | 04:54 AM

తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్‌ సుజయ్‌ పాల్‌ ప్రమాణస్వీకారం చేశారు. మొదటి కోర్టు హాల్‌లో మంగళవారం ఉదయం 10 గంటలకు జరిగిన ఫుల్‌ కోర్టు సమావేశంలో చీఫ్‌ జస్టిస్‌ అలోక్‌

హైకోర్టు జడ్జిగా సుజయ్‌ పాల్‌ ప్రమాణ స్వీకారం

హైదరాబాద్‌, మార్చి 26 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్‌ సుజయ్‌ పాల్‌ ప్రమాణస్వీకారం చేశారు. మొదటి కోర్టు హాల్‌లో మంగళవారం ఉదయం 10 గంటలకు జరిగిన ఫుల్‌ కోర్టు సమావేశంలో చీఫ్‌ జస్టిస్‌ అలోక్‌ అరాధే జస్టిస్‌ ఆయనచే ప్రమాణస్వీకారం చేయించారు. అంతకుముందు రాష్ట్రపతి కార్యాలయం నుంచి వెలువడిన బదిలీ ఉత్తర్వులను, గవర్నర్‌ తరఫునచీఫ్‌ జస్టిస్‌ ప్రమాణస్వీకారం చేయించేందుకు వీలుగా జారీ అయిన జీవోను రిజిస్ట్రార్‌ జనరల్‌ చదివి వినిపించారు. ఈ కార్యక్రమంలో అందరు న్యాయమూర్తులు, అడ్వకేట్‌ జనరల్‌ సుదర్శన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జస్టిస్‌ సుజయ్‌ పాల్‌ మధ్యప్రదేశ్‌ నుంచి తెలంగాణ హైకోర్టుకు బదిలీ అయ్యారు. కలకత్తా హైకోర్టు నుంచి బదిలీపై వస్తున్న మరో జడ్జి మౌసమీ భట్టాచార్య ఈనెల 28న ప్రమాణస్వీకారం చేయనున్నారు.

Updated Date - Mar 27 , 2024 | 04:54 AM