Share News

గళమెత్తిన విద్యార్థులు

ABN , Publish Date - Jan 09 , 2024 | 11:08 PM

పాలమూరు యూనివర్సిటీలో నెల కొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని మంగళవారం విద్యార్థులు పీయూ పీజీ కళాశాల ముందు బైఠాయించారు.

గళమెత్తిన విద్యార్థులు
పీయూ వీసీకి వినతి పత్రం ఇస్తున్న ఏబీవీపీ నాయకులు

- పీయూ సమస్యలపై విద్యార్థుల ధర్నా

- అధికారులు, విద్యార్థులతో కలిసి హాస్టల్‌న్‌ పరిశీలించిన వీసీ

పాలమూరు యూనివర్సిటీ, జనవరి 9 : పాలమూరు యూనివర్సిటీలో నెల కొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని మంగళవారం విద్యార్థులు పీయూ పీజీ కళాశాల ముందు బైఠాయించారు. యూనివర్సిటీలో నీళ్లు సరిగ్గా రావని, ఎక్కడ చూసినా పైపులు లీకేజీలేనని, కరెంటు బోర్డులు, స్వీచ్‌లు లేవని, అంబు లెన్స్‌ సౌకర్యంలేదని, ఎక్కడ చూసినా దుర్వాసన వస్తోందని అన్నారు. కబోర్డు లకు డోర్లు, రూంలకు తలుపులు లేవని విద్యార్థులు తెలిపారు. అత్యవసర సమయంలో డాక్టర్‌ అందుబాటులో ఉండేలా చూడాలని, అంబులెన్స్‌ సౌకర్యం కల్పించాలని వీసీని విద్యార్థులు కోరారు. అనంతరం ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు వైస్‌చాన్స్‌లర్‌కు సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందించారు. విద్యార్థుల వినతి స్వీకరించిన వీసీ అధికారులతో కలిసి హాస్టల్‌ను పరిశీలిం చారు. విద్యార్థులు తమ దృష్టికి తీసుకొచ్చిన సమస్యలను త్వరితగతిన పరిష్క రించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ గిరిజా మంగతాయారు, కళాశాల డైరెక్టర్‌ ఓఎస్‌డీ డాక్టర్‌ మధుసూదన్‌ రెడ్డి, ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ చంద్రకిరణ్‌, వైస్‌ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ కృష్ణయ్య, అధికారులు వార్డెన్స్‌, కేర్‌టేకర్స్‌ ఏబీవీపీ నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - Jan 09 , 2024 | 11:08 PM