Share News

విద్యార్థులు డిజిటల్‌ టెక్నాలజీపై దృష్టి పెట్టాలి

ABN , Publish Date - Mar 06 , 2024 | 11:21 PM

విద్యార్థులు డిజిటల్‌ టెక్నాలజీపై ప్రత్యేక దృష్టి పెట్టాలని విద్యార్థులు స్వంతంగా వెబ్‌సైట్‌ డిజైన్‌ చేసుకోవాలని ఎన్‌టీఆర్‌ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ విజయ్‌కుమార్‌ అన్నారు.

విద్యార్థులు డిజిటల్‌ టెక్నాలజీపై దృష్టి పెట్టాలి
సమావేశంలో మాట్లాడుతున్న ప్రిన్సిపాల్‌ విజయకుమార్‌

- ఎన్‌టీఆర్‌ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ విజయ్‌కుమార్‌

మహబూబ్‌నగర్‌ విద్యావిభాగం, మార్చి 6 : విద్యార్థులు డిజిటల్‌ టెక్నాలజీపై ప్రత్యేక దృష్టి పెట్టాలని విద్యార్థులు స్వంతంగా వెబ్‌సైట్‌ డిజైన్‌ చేసుకోవాలని ఎన్‌టీఆర్‌ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ విజయ్‌కుమార్‌ అన్నారు. బుధవారం కళాశాలలో వాణిజ్య విభాగం, ఐఏఏం కలకత్తా మేకింగ్‌టైం ఇన్‌స్టిట్యూట్‌ ఆధ్వర్యంలో డిజిటల్‌ మార్కెటింగ్‌పై సర్టిఫికెట్‌ కోర్సుల శిక్షణ ముగింపు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్‌ విజయకుమార్‌ మాట్లాడుతూ విద్యార్థులు విద్యతో పాటు అన్ని రంగాల్లో రాణించాలన్నారు. నేటి పోటీ ప్రపంచంలో విద్యార్థులు అన్ని రంగాల్లో ముందుండాలని పిలుపునిచ్చారు. లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్‌ కె.భాస్కర్‌, అధ్యాపకులు డాక్టర్‌ నాగలక్ష్మి, వాసంతి పాల్గొన్నారు.

Updated Date - Mar 06 , 2024 | 11:21 PM