Share News

విద్యార్థులు ఉన్నత శిఖరాలు అధిరోహించాలి

ABN , Publish Date - Oct 27 , 2024 | 12:52 AM

విద్యార్థులు మంచిగా చదువుకొని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని సాగర్‌ సిమెంట్స్‌ పరిశ్రమ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ ఎంవీ. రమణమూర్తి అన్నారు.

విద్యార్థులు ఉన్నత శిఖరాలు అధిరోహించాలి
మెరిట్‌ స్కాలర్‌షిప్‌ అందుకున్న విద్యార్థులతో పరిశ్రమ ప్రతినిధులు

మఠంపల్లి, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి): విద్యార్థులు మంచిగా చదువుకొని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని సాగర్‌ సిమెంట్స్‌ పరిశ్రమ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ ఎంవీ. రమణమూర్తి అన్నారు. మండలంలోని 9 ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో 2022-23 విద్యా సంవత్సరంలో పదో తరగతిలో ప్రతిభ కనపరిచిన విద్యార్ధులకు సాగర్‌ సిమెంట్స్‌ వ్యవస్థాపకుడు, మేనేజింగ్‌ డైరెక్టర్‌ సమ్మిడి వీరారెడ్డి స్మారక మెరిట్‌ అవార్డులను శనివారం పరిశ్రమ ఆడిటోరియంలో అందజేశారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉన్నత చదువుల కోసం పరిశ్రమ ఆధ్వర్యంలో 38మంది విద్యార్థులకు రూ.4.50లక్షల ఆర్థిక సాయం అందించడం అభినందనీయమని ఎంఈవో వెంకటాచారి అన్నారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమ ప్రతినిధులు డీజీఎం హెచ్‌ఆర్‌ హెచ్‌ఆర్‌ హరిదాసు, డిప్యూటీ మేనేజర్‌ హెచ్‌ఆర్‌ వెంకటరెడ్డి, తుడి వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 27 , 2024 | 12:52 AM