విద్యార్థులకు అర్థమయ్యేలా బోధించాలి
ABN , Publish Date - Jan 18 , 2024 | 11:12 PM
విద్యార్థులకు అర్థమయ్యేలా బోధించాలని అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ ఆదేశించారు.
- అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్
గోపాల్‌పేట, జనవరి 18: విద్యార్థులకు అర్థమయ్యేలా బోధించాలని అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ ఆదేశించారు. గురువారం మండలంలోని చెన్నూరు చా కలిపల్లి గ్రామాలలోని ప్రాథమిక పాఠశాలలను అదనపు కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాలలోని రిజిస్టర్లను తనిఖీ చేశారు. పాఠశాల పరిస్థితులు, ఉపాధ్యాయుల తీరుపై ప్రధానోపాధ్యాయులతో చర్చించా రు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడుతూ మ్యాథమెటిక్స్, ఇంగ్లిష్, హిందీ వంటి కఠిన సబ్జెక్టులను తేలికగా అర్థమయ్యేలా బోధిస్తే విద్యార్థులు రాణిస్తారన్నా రు. ఎప్పటికప్పుడు విద్యార్థులను పరీక్షించాలని సూచించారు. అనంతరం విద్యా ర్థుల సామర్థ్యాలను అదనపు కలెక్టర్ పరిశీలించారు. పలు ప్రశ్నలకు బోర్డుపై సమాధానం ఇచ్చారు. కార్యక్రమంలో ఎంఈవో శ్రీనివాస్‌గౌడ్, ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.