విద్యార్థులకు మెరుగైన వసతి కల్పించాలి
ABN , Publish Date - Nov 28 , 2024 | 11:35 PM
గురుకులాలు, వసతి గృహాల్లో విద్యా ర్థులకు మెరుగైన వసతులు కల్పించా లని అడిషనల్ కలెక్టర్ కే.సీ తారామారా వు ఆదేశించారు.

- అదనపు కలెక్టర్ సీతారామారావు
కల్వకుర్తి, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి) : గురుకులాలు, వసతి గృహాల్లో విద్యా ర్థులకు మెరుగైన వసతులు కల్పించా లని అడిషనల్ కలెక్టర్ కే.సీ తారామారా వు ఆదేశించారు. నాణ్యమైన భోజనాలు పరిశుభ్రమైన వాతావరణం ఉండాల్సిందే నని ఆయన పేర్కొన్నారు. కల్వకుర్తి పట్ట ణ పరిధిలోని జేపీ నగర్‌లోని సాంఘిక సంక్షేమ గురుకులాన్ని గురువారం ఆర్డీవో ఎస్.శ్రీను, తహసీల్దార్ ఇబ్రహీంతో కలిసి అడిషనల్ కలెక్టర్ సీతారామారావు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గురుకులంలోని పరి సరాలను, విద్యార్థుకు వండిన భోజనాలను, ఆహార వస్తువులను క్షుణ్ణంగా పరిశీలించారు. డైనింగ్‌హాల్ సమీపంలో పరిసరాలు పరిశు భ్రంగా ఉంచుకోవాలని ఆదేశించారు. అనంత రం విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు గురుకులంలో వసతులు సమకూర్చాలన్నారు.
నాణ్యమైన విద్య అందించాలి
వెల్దండ : ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని ఎంఈవో చంద్రుడు ఉపాధ్యాయులకు సూచించారు. గురువారం మండల పరిధిలోని బర్కత్‌పల్లి, చొక్కన్నపల్లి, చెర్కూర్ ప్రాథమిక పాఠశాలలను చంద్రుడు అకస్మికంగా తనిఖీ చేశారు. కార్యక్రమంలో జీహెచ్‌ఎం రవీందర్, కేజీబీవీ ఎస్‌వో శ్రవంతి ఉన్నారు.
భోజనంలో నాణ్యత పాటించకుంటే చర్యలు
బల్మూరు : విద్యార్థినులకు అందించే భోజ నంలో నాణ్యత లోపిస్తే చర్యలు తప్పవని ఎం పీడీవో రాఘవులు అన్నారు. గురువారం మం డల కేంద్రంలోని బీసీ బాలికల వసతి గృహా న్ని ఆయన తనిఖీ చేశారు. భోజనం విషయ మై వార్డెన్ కుర్వమ్మకు సూచనలు చేస్తూ పరి సరాల ప్రాంతాలను శుభ్రపర్చుకోవాలని సూచించారు.