Share News

Kumaram Bheem Asifabad- విద్యార్థులకు మెరుగైన విద్య అందించాలి

ABN , Publish Date - Apr 16 , 2024 | 10:51 PM

ఆశ్రమ పాఠశాలల విద్యార్థులకు మెరుగైన విద్యను అందించాలని ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా ఉపాధ్యాయులను ఆదేశించారు. మండలంలోని మోడి గ్రామంలోని పాఠశాలను ఆమె మంగళవారం తనిఖీ చేశారు.

Kumaram Bheem Asifabad-    విద్యార్థులకు మెరుగైన విద్య అందించాలి
ఆశ్రమ పాఠశాలను తనిఖీ చేస్తున్న ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా

కెరమెరి, ఏప్రిల్‌ 16: ఆశ్రమ పాఠశాలల విద్యార్థులకు మెరుగైన విద్యను అందించాలని ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా ఉపాధ్యాయులను ఆదేశించారు. మండలంలోని మోడి గ్రామంలోని పాఠశాలను ఆమె మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు అందిస్తున్న విద్య, వైద్యం, భోజనంపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. పాఠశాల రిజిస్టర్‌, స్టాక్‌ రిజిస్టర్లలో అవకతవకలు ఉండడం, విద్యార్థులు పాఠశాల బయటికి వెళ్లి నీరు తాగడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏటీడబ్ల్యూవో అర్జున్‌, ప్రధానోపాధ్యాయుడు సాయిలకు నోటీసు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతీ రోజు మెనూ ప్రకారం పోషక విలువల గల ఆమారాన్ని అందించాలన్నారు. సబ్జెక్టుల వారీగా విద్యార్థులకు అర్ధమయ్యే రీతిలో విద్యాబోధన చేయాలని సూచించారు. పాఠశాల గదులు, పరిసరాల్లో చెత్తాచెదారం లేకుండా ఎప్పటికప్పుడు సిబ్బంది తొలగించాలని సూచించారు.

Updated Date - Apr 16 , 2024 | 10:51 PM