Share News

ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను చేర్పించాలి

ABN , Publish Date - Jun 07 , 2024 | 11:21 PM

మండల పరిధిలోని జాజాపూర్‌ జడ్పీ ఉన్నత పాఠశాలలో శుక్రవారం ఉపాధ్యాయులు బడిబాట కార్యక్రమం నిర్వహించారు.

 ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను చేర్పించాలి
జాజాపూర్‌లో బడిబాటలో పాల్గొన్న ఉపాధ్యాయులు

నారాయణపేటరూరల్‌, జూన్‌7: మండల పరిధిలోని జాజాపూర్‌ జడ్పీ ఉన్నత పాఠశాలలో శుక్రవారం ఉపాధ్యాయులు బడిబాట కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ఉపాధ్యాయులు గ్రామంలోని ఇంటింటికి తిరిగి విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలకు పంపించాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యతో పాటు విద్యార్థులకు యూనిఫారంలు, పుస్తకాలు ఉచితంగా ఇవ్వనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో హెచ్‌ఎం కన్కప్ప, ఉపాధ్యాయులు భానుప్రకాశ్‌, లక్ష్మణ్‌, మాధవి, మధుసూదన్‌రావు, కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.

ఉజ్జెల్లి గ్రామంలో

మాగనూరు: ప్రభుత్వ పాఠశాలల్లోనే మెరుగైన విద్య అందుతుందని మండల విద్యాధికారి వెంకటయ్య అన్నారు. శుక్రవారం మాగనూరు మండలంలోని ఉజ్జెల్లి గ్రామంలో బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. బడిబయట ఉన్న పిల్లలను బడిలో చేర్పించాలని తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రైవేటుకు దీటుగా విద్య అందుతుందని పేర్కొన్నారు. ప్రధానోపాధ్యాయులు సాయిబాబా, అరుణ, రామకృష్ణ, భవ్యశ్రీ, సీఆర్‌పీ ఎల్లాగౌడ్‌ పాల్గొన్నారు.

Updated Date - Jun 07 , 2024 | 11:21 PM