Share News

విద్యార్థులకు కరాటే, యోగా అవసరం

ABN , Publish Date - Jan 11 , 2024 | 11:11 PM

మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థులకు విద్యతో పాటు యోగా, కరాటే వంటివి చాలా అవసరమని దేవరకద్ర నియోజక వర్గ ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి అన్నారు.

విద్యార్థులకు కరాటే, యోగా అవసరం
భూత్పూర్‌ కసూర్బాలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి

- ఎమ్మెల్యే జి. మధుసూదన్‌రెడ్డి

భూత్పూర్‌, జనవరి 11 : మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థులకు విద్యతో పాటు యోగా, కరాటే వంటివి చాలా అవసరమని దేవరకద్ర నియోజక వర్గ ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి అన్నారు. మూడు రోజులుగా మండల కేంద్రంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో అంతర పాఠశాలల స్థాయి కరాటే పోటీలు నిర్వహించారు. విజేతలైన విద్యార్థులకు గురువారం స్థానిక కస్తూర్బా గాంధీ పాఠశాలలో ఏర్పాటు మెడల్స్‌ పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. యోగా, కరాటే వంటి వాటిల్లో రాణించాలని విద్యార్థులకు సూచించారు. ఈ సందర్భంగా కస్తూర్బాగాంధీలో మౌలిక వసతులు కల్పించాలని పాఠశాల ఎస్‌వో ఎమ్మెల్యేకు వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ పట్టణ అధ్యక్షుడు నవీన్‌గౌడ్‌, పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు నర్సింహారెడ్డి, మాజీ ఎంపీటీసీ పద్మ, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు మట్టి ఆనంద్‌కుమార్‌, కెంద్యాల నరేందర్‌, ఎంఈవో నాగయ్య, కస్తూర్బాగాంధీ పాఠశాల ఎస్‌వో ప్రశాంతి, అధ్యాపకులు పాల్గొన్నారు.

స్వంత డబ్బుతోనైనా టాయిలెట్లు నిర్మిస్తా : ఎమ్మెల్యే

అడ్డాకుల : మరికొన్ని రోజుల్లోనే అడ్డాకుల ఉన్నత పాఠశాలలో ప్రభుత్వ లేదా తన స్వంత నిధులతోనైనా టాయిలెట్లు నిర్మిస్తానని ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి అన్నారు. గురువారం అడ్డాకుల ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 500 మంది విద్యార్థులు ఉన్నా టాయిలెట్లు, కనీస వతులు లేకపోవడంపై ఆవేదన చెందారు. రెండు రోజుల క్రితం మధ్యాహ్న భోజన విరామంలో విద్యార్థులు టాయిలెట్లు నిర్మించా లని బైఠాయించిన విషయం తెలిసిందే. దీంతో ఎమ్మెల్యే వెంటనే ఆ పాఠశాలను తనిఖీ చేశారు. పాఠశాలలో నెలకొన్న సమస్యలపై సిబ్బంది వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు కొండా జగదీశ్‌, డీసీసీ కార్యదర్శి విజయమోహన్‌రెడ్డి, దశరథ్‌రెడ్డి, కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు నాగిరెడ్డి, సర్పంచు మంజుల, హెచ్‌ఎం, ఉపాధ్యాయులు, ఉపసర్పంచు శ్రీనివాస్‌ రెడ్డి, మైనార్టీసెల్‌ అధ్యక్షుడు షఫీహమ్మద్‌, శరత్‌కుమార్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి, బాలరాజు పాల్గొన్నారు.

Updated Date - Jan 11 , 2024 | 11:11 PM