Share News

డబ్బు, మద్యం పంపిణీపై గట్టి నిఘా ఉంచాలి

ABN , Publish Date - May 08 , 2024 | 11:16 PM

పార్లమెంట్‌ ఎన్నికల సందర్భంగా డబ్బు, మద్యం, ఉచిత కానుకల పంపిణీపై గట్టి నిఘా ఉంచాలని కేంద్ర ఎన్ని కల సాధారణ పరిశీలకులు షెవాంగ్‌ గ్యాచో భూటియా, ఎన్నికల వ్యయ పరిశీల కులు వరుణ్‌ రంగస్వామిలు అన్నారు.

డబ్బు, మద్యం పంపిణీపై గట్టి నిఘా ఉంచాలి
మాట్లాడుతున్న కేంద్ర ఎన్నికల పరిశీలకుడు షెవాంగ్‌ గ్యాచో భూటియా

- కేంద్ర ఎన్నికల సాధారణ పరిశీలకుడు షెవాంగ్‌ గ్యాచో భూటియా, ఎన్నికల వ్యయ పరిశీలకుడు వరుణ్‌ రంగస్వామి

మహబూబ్‌నగర్‌ (కలెక్టరేట్‌), మే 8 : పార్లమెంట్‌ ఎన్నికల సందర్భంగా డబ్బు, మద్యం, ఉచిత కానుకల పంపిణీపై గట్టి నిఘా ఉంచాలని కేంద్ర ఎన్ని కల సాధారణ పరిశీలకులు షెవాంగ్‌ గ్యాచో భూటియా, ఎన్నికల వ్యయ పరిశీల కులు వరుణ్‌ రంగస్వామిలు అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ జి. రవినాయక్‌తో కలిసి వారు ఎక్సైజ్‌, పోలీస్‌, వాణిజ్య పన్నుల శాఖ, ఇన్‌కం ట్యాక్స్‌ శాఖల అధికారులు, ఎన్నికల వ్యయ పర్యవేక్షణ నోడల్‌ అధికారి, ఎల్‌.డి.ఎంతో సమావేశం నిర్వహించారు. ఎన్నికల సందర్భంగా తీసుకుంటున్న చర్యలపై చర్చించి సూచనలు చేశారు. చెక్‌ పోస్టుల వద్ద అన్ని వాహనాలు తనిఖీ నిర్వహించాలని అన్నారు. బ్యాంకులలో అనుమానిత లావాదేవీలు, గూగుల్‌ పై, యు.పి.ఐ., ఫోన్‌ పే ద్వారా మల్టిపుల్‌ లావాదేవీలపై బ్యాంక్‌ అధికారులు పరిశీలించాలని లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్‌ను ఆదేశించారు. బస్టాండ్‌, రైల్వేల ద్వారా డబ్బు, మద్యం రవాణపై కూడా నిఘా ఉంచాలని అన్నారు. క్యూ ఆర్‌ కోడ్‌ కు పన్స్‌ ద్వారా చెల్లింపులపై కూడా ద్రుష్టి సారించి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ జి. రవినాయక్‌ మాట్లాడుతూ ఎన్నికలలో వివిధ శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఈ సమావశంలో వివిధ శాఖల అధికారులు, నోడల్‌ అధికారులు పాల్గొన్నారు.

Updated Date - May 08 , 2024 | 11:16 PM