Share News

కఠిన చర్యలు తీసుకోవాలి

ABN , Publish Date - Apr 24 , 2024 | 11:36 PM

పాలమూరు యూనివర్సిటీ ప్రతి ష్ఠను దిగజార్చేల వ్యవహరిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పీయూ విద్యార్థి సంఘాల జేఏసీ నాయకులు డిమాండ్‌ చేశారు.

కఠిన చర్యలు తీసుకోవాలి
సమావేశంలో మాట్లాడుతున్న పీయూ విద్యార్థి సంఘాల నాయకులు

- పీయూ ప్రతిష్ఠను దిగజార్చేలా వ్యవహరిస్తున్న వారిపై విచారించాలి - పీయూ విద్యార్థి సంఘాల జేఏసీ

పాలమూరు యూనివర్సిటీ ఏప్రిల్‌ 24 : పాలమూరు యూనివర్సిటీ ప్రతి ష్ఠను దిగజార్చేల వ్యవహరిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పీయూ విద్యార్థి సంఘాల జేఏసీ నాయకులు డిమాండ్‌ చేశారు. బుధవారం పీయూలో వివిధ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమవేశంలో విద్యార్థి సంఘాల జేఏసీ చైర్మన్‌ బత్తిని రాము మాట్లాడారు. పాలమూరు టీచ ర్స్‌ అసోసియోషన్‌, ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్‌ మధ్య జరుగుతున్న గొడవలపై పీయూ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రత్యేక కమిటీ వేసి బాధ్యులపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. యూనివర్సిటీలో గొడవలు ఆపి విద్యార్థులకు ప్రశాంత మైన అకాడమిక్‌ వాతావరణం నెలకొల్పాలని, విద్యార్థుల ను కులాలవారీగా విడ దీసి వాళ్ల స్వలాభాల కోసం పెడదోవ పట్టిస్తున్న వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని కోరారు. పాలమూరు యూనివర్సిటీకి సంబంధం లేని అనధికార వ్యక్తులు ఇష్టానుసారంగా వాహనాలతో యూనివర్సిటీలోకి వచ్చి పంచాయితీ లకు, పైరవీలకు పీయూ ఫార్మసీ కళాశాలను అడ్డాగా మార్చారని అన్నారు. ఉద్యోగులను భయాందోళనకు గురిచేసే విధంగా భయభ్రాంతులకు గురి చేస్తు న్నారని అన్నారు. చిన్న చిన్న కాంట్రాక్ట్‌ ఉద్యోగాలు చేసుకునే వారిని ఆడిట్‌ పేరుతో, వాళ్ల వేతనాల స్లిప్పుల పేరుతో తెల్లకాగితాలపై సంతకాలు పెట్టాలని, రకరకాలుగా వేధించడం సరికాదన్నారు. అన్ని విషయాలపై సమగ్రమైన విచా రణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, లేని యెడల విద్యార్థి సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్‌ఎఫ్‌ పీయూ అధ్యక్షుడు పవన్‌రెడ్డి, పీయూ ఎంఏస్‌ఎఫ్‌ అధ్యక్షుడు మీసాల గణేష్‌, మాదిగ ఎస్‌ఎస్‌యూ అధ్యక్షుడు సురేంధర్‌, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి దాసు, విద్యార్థి సంఘాల నాయకులు పుట్టపాగ వంశీ, వెంకటేష్‌, ఆంజనేయులు, నరేష్‌, వినయ్‌, రాజు పాల్గొన్నారు.

Updated Date - Apr 24 , 2024 | 11:36 PM