Share News

నేరాల నియంత్రణకు కఠినంగా వ్యవహరించాలి

ABN , Publish Date - Apr 18 , 2024 | 11:55 PM

నేర నియంత్రణకు పోలీస్‌ అధికారులు కఠినంగా వ్యవహరించాలని రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ తరుణ్‌ జోషి అన్నారు.

నేరాల నియంత్రణకు  కఠినంగా వ్యవహరించాలి
కీసర పోలీస్‌ స్టేషన్‌ సిబ్బందితో మాట్లాడుతున్న రాచకొండ సీపీ తరుణ్‌జోషి

రాచకొండ సీపీ తరుణ్‌ జోషి

కీసర,ఏప్రిల్‌18: నేర నియంత్రణకు పోలీస్‌ అధికారులు కఠినంగా వ్యవహరించాలని రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ తరుణ్‌ జోషి అన్నారు. రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ తరుణ్‌ జోషి గురువారం కీసర పోలీస్‌ స్టేషన్‌ను సందర్శించి నేర నియంత్రణపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఫోక్సో కేసులు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, పెండింగ్‌, గ్రేవ్‌ కేసుల విచారణ, ఇతర కేసుల విచారణ పురోగతిపై స్థానిక ిసీఐ వెంకటయ్యను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆనంతరం ఆయన మాట్లాడుతూ నేర నియంత్రణకు అవసరమైన చట్టపరమైన చర్యలు అన్ని తీసుకోవాలన్నారు. ఫిర్యాదు చేయడానికి పోలీ్‌సస్టేషన్‌కు వచ్చిన వారితో స్నేహపూర్వకంగా వ్యవహరించాలన్నారు. అదే విధంగా ఆపదలో ఎవ్వరైన పోలీస్‌ స్టేషన్‌కు గాని, 100 నంబర్‌పై వచ్చిన ఫిర్యాదులకు వెంటనే స్పందించి న్యాయం చేయాలన్నారు. ఆనంతరం ఉద్యోగుల పనితీరుపై సలహాలు, సూచనలు తెలియజేశారు. అదే విధంగా లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా తగిన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇప్పటీ వరకు రాచకొండ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో దాదాపు రూ. ఏడు కోట్ల వరకు నగదు పట్టివేత జరిగిందన్నారు. అదే విధంగా మద్యం పట్టివేత కూడా జరిగినట్లు తెలిపారు. ఎన్నికలకు పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో ఎన్నికలు సజావుగా జరిగే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు సీపీ తరుణ్‌ జోషి తెలిపారు. కార్యక్రమంలో మాల్కాజ్‌గిరి డీసీపీ పద్మాజా, ఏసీపీ నరేందర్‌గౌడ్‌, కీసర పోలీస్‌ స్టేషన్‌ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 18 , 2024 | 11:55 PM