Share News

Manchiryāla- నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు

ABN , Publish Date - May 31 , 2024 | 10:43 PM

ఫెర్టిలైజర్‌ దుకాణాల్లో రైతులకు నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా వ్యవసాయాధికారి సురేఖ హెచ్చరించారు. శుక్రవారం లక్షెట్టిపేట పట్టణంలోని పలు ఫెర్టిలైజర్‌ దుకాణాల్లో తనిఖీలు నిర్వహించారు

Manchiryāla-        నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు
లక్షెట్టిపేటలో తనిఖీలు చేస్తున్న జిల్లా వ్యవసాయాధికారి సురేఖ

లక్షెట్టిపేటరూరల్‌, మే 31: ఫెర్టిలైజర్‌ దుకాణాల్లో రైతులకు నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా వ్యవసాయాధికారి సురేఖ హెచ్చరించారు. శుక్రవారం లక్షెట్టిపేట పట్టణంలోని పలు ఫెర్టిలైజర్‌ దుకాణాల్లో తనిఖీలు నిర్వహించారు. విత్తనాల ప్యాకె ట్లు, రశీదు బిల్లులను పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ రైతులకు విత్తనాలు అమ్మినప్పుడు బిల్లులు తప్పనిసరిగా అందించాలన్నారు. నకిలీ విత్తనాలు విక్రయిస్తే చర్యలుంటాయన్నారు. ఆమె వెంట మండల వ్యవసాయాధికారి ప్రభాకర్‌ తదితరులు ఉన్నారు.

తాండూర్‌: మండలంలోని పలు ఫెర్టిలైజర్‌ దుకాణాల్లో శుక్రవారం వ్యవసాయ, శాఖ, పోలీసు శాఖల ఆద్వర్యంలో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. తాండూర్‌ సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ కుమారస్వామి, మండల వ్యవసాయాధికారి కిరణ్మయిలు తనిఖీలు దుకాణాల్లోని స్టాక్‌ రిజిష్టర్‌లను, బిల్లు పుస్తకాలను పరిశీలించారు. ఈ సందర్భంగా వఆరు మాట్లాడుతూ రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అమ్మాలని , అమ్మిన వాటికి సంబంధించిన రసీదులో యాజమాని సంతకం , రైతు సంతకం తప్పనిసరిగా ఉండాలన్నారు. నకిలీ విత్తనాలు, ఎరువులు అమ్మితే కేసులు నమోదు చేయడంతో పాటు షాపుల లైసెన్స్‌లు రద్దు చేయడం జరుగుతుందన్నారు. అలాగే రైతులు లైసెన్స్‌ ఉన్న దుకాణాల్లోనే విత్తనాలు కొనుగోలు చేయాలని సూచించారు. నకిలీ విత్తనాలు కొని మోసపోవద్దని సూచించారు. ఈ తనిఖీల్లో ఏఈవో శంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 31 , 2024 | 10:43 PM