Share News

నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు

ABN , Publish Date - May 19 , 2024 | 11:43 PM

జిల్లాలో నకిలీ, కాలం చెల్లిన విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని, కేసులు నమోదు చేయడమే కాకుండా పీడీ యాక్ట్‌ కూడా పెడతామని జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి హెచ్చరించారు.

నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు

ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి

వికారాబాద్‌, మే 19 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో నకిలీ, కాలం చెల్లిన విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని, కేసులు నమోదు చేయడమే కాకుండా పీడీ యాక్ట్‌ కూడా పెడతామని జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి హెచ్చరించారు. వానాకాలం సాగు సీజన్‌ ప్రారంభమైన సందర్భంగా ఆదివారం ఆయన నకిలీ విత్తనాలపై అప్రమత్తంగా ఉండాలని రైతులకు సూచించారు. వానాకాలం సాగు సీజన్‌ ప్రారంభ ం కావడంతో కొందరు నేరగాళ్లు తమ స్వలాభం కోసం అమాయక రైతులకు నకిలీ, కాలం తీరిన విత్తనాలు అంటగట్టి వారికి నష్టం కలిగించే విధంగా వ్యవహరించే అవకాశం ఉందన్నారు. నాణ్యత కలిగిన విత్తనాలే కొనుగోలు చేయాలని, ఈ విషయంలో రైతులు అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. పోలీసు అఽధికారులు వ్యవసాయ, సంబంధిత అధికారులతో కలిసి విత్తనాలు, ఎరువుల దుకాణాలపైన దాడులు నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లాలో నకిలీ విత్తనాలు విక్రయిస్తున్న సమాచారం అందితే వెంటనే పోలీసులకు, జిల్లా టాస్క్‌ఫోర్స్‌ అధికారులకు, లేదా డయల్‌ 100కు కాల్‌ చేసి సమాచారం అందించాలని సూచించారు.

Updated Date - May 19 , 2024 | 11:43 PM