Share News

అబద్ధపు ప్రచారాలు ఆపండి

ABN , Publish Date - Jul 08 , 2024 | 11:29 PM

అసత్య ప్రచారాలు, మోసపూరిత చర్యలతో ఎన్నికల్లో లబ్ధిపొందారని, గెలిచాక కూడా తనపై తప్పుడు ప్రచారాలు చేయడమే పనిగా పెట్టుకోవడం సరికాదని మాజీ మంత్రి వి శ్రీనివా్‌సగౌడ్‌ అన్నారు.

అబద్ధపు ప్రచారాలు ఆపండి
విలేకరులతో మాట్లాడుతున్న శ్రీనివాస్‌గౌడ్‌

- నేను టూరిజం ప్లాజా లీజుకు

తీసుకుంటే నిరూపించండి

- మాజీమంత్రి వి. శ్రీనివా్‌సగౌడ్‌

మహబూబ్‌నగర్‌, జూలై 8: అసత్య ప్రచారాలు, మోసపూరిత చర్యలతో ఎన్నికల్లో లబ్ధిపొందారని, గెలిచాక కూడా తనపై తప్పుడు ప్రచారాలు చేయడమే పనిగా పెట్టుకోవడం సరికాదని మాజీ మంత్రి వి శ్రీనివా్‌సగౌడ్‌ అన్నారు. మహబూబ్‌నగర్‌లోని న్యూటౌన్‌ పార్టీ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మహబూబ్‌నగర్‌ బస్టాండ్‌ వద్ద గాంధీ, ఉస్మానియా ఆస్పపత్రులను తలపించేరీతిలో 1,000 పడకల ఆస్పత్రిని తెచ్చామని, అలాంటి భవనం స్వాతంత్య్రం వచ్చిన దగ్గరనుంచి ఇప్పటివరకు ఎక్కడైనా ఎవరైనా కట్టించారో చూపించాలని ప్రశ్నించారు. ఆస్పత్రి పనులను పరిశీలించేందుకు వచ్చిన మంత్రికి ఇక్కడి ఎమ్మెల్యే దవాఖానా ముందు టూరిజం ప్లాజాను శ్రీనివా్‌సగౌడ్‌ 99 ఏళ్లకు లీజుకు తీసుకున్నాడని చెప్పడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించా రు. ప్రభుత్వంలో మీరే ఉన్నారని, తాను లీజుకు తీసుకుంటే ఆ కాగితాలు చూపించాలన్నారు. తప్పుడు ప్ర చారాలు, అబద్ధాలు ఇంకా ఎన్నిరోజులు చెబుతారని, ముందు పాలమూరు అభివృద్ధిపై దృష్టి పెట్టాలని అ న్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చడంపై ఆలోచన చేయాలని సూచించారు. తాను మంత్రిగా ఉన్న స మయంలో ఎన్నో పనులు చేపట్టామని, అందులో చాలా పనులు నిర్మాణంలో ఉన్నాయన్నారు. దాదాపు రూ. 1,800 కోట్లకు సంబంధించిన ప నులు మహబూబ్‌నగర్‌లో చేపట్టాల్సి ఉందన్నారు. ముందు ఆ పనులన్నీ టేకప్‌ చేసేలా చర్యలు తీసుకుంటే మహబూబ్‌నగర్‌ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందన్నారు. టెండర్లు అయ్యాయి అంటే బడ్జెట్‌ కేటాయించినట్లేనని, ఆ పనులు చేయకుండా బడ్జెట్‌ లేదని చెప్పడం సరైనది కాదన్నా రు. కాంగ్రెస్‌ నాయకులు చేస్తున్న తప్పుడు ప్రచారాలను ప్రజలు గ మనించాలన్నారు. పదేళ్లలో మహబూబ్‌నగర్‌ అభివృద్ధి కోసం ఎంతో కష్టపడ్డానని వివరించారు. పను లు చేసే క్రమంలో కొన్ని పొరపా ట్లు జరిగి ఉండొచ్చని, మరోసారి అలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకుని ఈ జిల్లా అభివృద్ధి, పేద ప్రజ ల సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తానన్నారు. తన ఫొటోలతో ఉన్న ఫ్లెక్సీలను తొలగించడం మంచి సంస్కృతి కాదని, అధికారం ఎవరికీ శాశ్వతం కాదన్న విషయాన్ని గుర్తించాలని అన్నారు. ప్లెక్సీల్లో ఫొటోలు తొలగించినంత సులువుగా ప్రజల మనసుల్లోంచి తనను తొలగించలేరన్నారు. ఎమ్మెల్యేలను కాంగ్రె్‌సలో చేర్చుకున్నంత మాత్రాన తమ పార్టీకి నష్టమేమీ ఉండదన్నారు. మళ్లీ పుంజుకుని అధికారంలోకి వస్తామన్నారు. కాంగ్రెస్‌ పని అయిపోయిందన్న సమయంలో మళ్లీ అధికారంలోకి రాలేదా అని గుర్తుచేశారు. సమావేశంలో నాయకులు కోరమోని నర్సింహులు, కోరమోని వెంకటయ్య, గంజి ఎంకన్న, శివరాజు, తాటిగణేష్‌, అనంతరెడ్డి, రాము, నవకాంత్‌, శ్రీనివా్‌సరెడ్డి, సుధాకర్‌ పాల్గొన్నారు.

Updated Date - Jul 08 , 2024 | 11:29 PM