Share News

మెటల్‌ రోడ్డు నిర్మాణానికి చర్యలు

ABN , Publish Date - Dec 01 , 2024 | 11:35 PM

నల్లమల అభ యారణ్య ప్రాంతంలోని అప్పా పూర్‌పెంట వరకు మెటల్‌ రోడ్డు ఏర్పాటుకు కృషి చేయను న్నట్లు రాష్ట్ర పంచాయతీ రాజ్‌ గ్రామీణా భివృద్ధి శాఖ మంత్రి సీతక్క తెలిపారు.

మెటల్‌ రోడ్డు నిర్మాణానికి చర్యలు
అప్పాపూర్‌ ఆశ్రమ పాఠశాలలో చెంచు విద్యార్థులతో కలిసి భోజనం చేస్తున్న మంత్రి సీతక్క, ఎమ్మెల్యే వంశీకృష్ణ

- రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి సీతక్క

మన్ననూర్‌/ ఉప్పునుంతల/ అచ్చంపే ట టౌన్‌, డిసెంబరు 1 (ఆంధ్రజ్యోతి) నల్లమల అభ యారణ్య ప్రాంతంలోని అప్పా పూర్‌పెంట వరకు మెటల్‌ రోడ్డు ఏర్పాటుకు కృషి చేయను న్నట్లు రాష్ట్ర పంచాయతీ రాజ్‌ గ్రామీణా భివృద్ధి శాఖ మంత్రి సీతక్క తెలిపారు. నల్లమల ప్రాంతంలోని చెంచులస్థితిగతుల ను తెలుసుకునేందుకు ఆమె స్థానిక ఎమ్మెల్యే డాక్టర్‌ వంశీకృష్ణతో కలిసి ఆదివారం విస్తృ తంగా పర్యటించారు. శ్రీశైలం దర్శనం అనం తరం తిరుగు ప్రయాణంలో ఆమె పర్హాబాద్‌ దృశ్యకేంద్రాన్ని సందర్శించి ప్రకృతి అందాలను తిలకించారు. అనంతరం అప్పాపూర్‌ పెంటకు వెళ్లారు. అక్కడి గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. చెంచు లకు దుప్పట్లను పంపిణీ చేశారు. కార్యక్ర మంలో అమ్రాబాద్‌ జడ్పీటీసీ మాజీ సభ్యు రాలు డాక్టర్‌ అనూరాధ, ఉమామహేశ్వర పాలకమండలి డైరెక్టర్‌ సంభు శోభ, నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

బీటీ రోడ్డ నిర్మాణానికి శంకుస్థాపన

అచ్చంపేటటౌన్‌/ ఉప్పునుంతల : మండ ల కేంద్రమైన ఉప్పునుంతల నుంచి అచ్చం పేట మండలంలోని పల్కపల్లి గ్రామం వరకు రూ.4 కోట్లా 50 లక్షలతో మంజారైన బీటీ రోడ్డుకు ఆదివారం పంచాయతీ రాజ్‌ గ్రామీణ అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ మంత్రి (ధనసరి అనసూయ) సీతక్క, ఎమ్మెల్యే వంశీకృష్ణతో కలిసి శంకుస్థాపన చేశారు. అదే విధంగా అచ్చంపేట మండల పరిధిలోని ఐనోలు నుం చి కన్యతండా వరకు రూ.కోటీ 50 లక్షల బీటీ రోడ్డుకు ఎమ్మెల్యేతో కలిసి మంత్రి సీతక్క శం కుస్థాపన చేశారు. కార్యక్రమంలో డీసీసీ జన రల్‌ సెక్రటరీ జిల్లెల జగత్‌రెడ్డి, నాయకులు నర్సింహారెడ్డి తదితరులు ఉన్నారు.

Updated Date - Dec 01 , 2024 | 11:35 PM