Share News

3 నెలల్లో బీఆర్‌ఎస్‌ను బొంద పెడతాం

ABN , Publish Date - Apr 18 , 2024 | 04:24 AM

కేసీఆర్‌... కాంగ్రెస్‌ ప్రభుత్వం జోలికి వస్తే మా తడాఖా ఏంటో చూపిస్తాం... మూడు నెలల్లో బీఆర్‌ఎ్‌సను బొంద పెడతాం... హైదరాబాద్‌లోని ఆ పార్టీ భవనాన్ని పునాదులతో లేపేస్తామని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి హెచ్చరించారు. నల్లగొండలో

3 నెలల్లో బీఆర్‌ఎస్‌ను బొంద పెడతాం

కేసీఆర్‌.. మా జోలికొస్తే తడాఖా చూపిస్తాం

30 మంది ఎమ్మెల్యేలు వస్తామంటున్నారు

లోక్‌సభ ఎన్నికల్లో మీకు ఒక్క సీటూ రాదు

కవిత జైలుకెళ్లడంతో కుటుంబానికి మెంటల్‌

లేచింది.. ఆమెకు రెండేళ్ల దాకా బెయిల్‌ రాదు

యాదాద్రి ప్లాంట్‌ అవినీతిపై జగదీశ్‌ జైలుకే..

ఎన్నికల కోడ్‌ తర్వాత రుణమాఫీ అమలు

రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

నల్లగొండ, ఏప్రిల్‌ 17: కేసీఆర్‌... కాంగ్రెస్‌ ప్రభుత్వం జోలికి వస్తే మా తడాఖా ఏంటో చూపిస్తాం... మూడు నెలల్లో బీఆర్‌ఎ్‌సను బొంద పెడతాం... హైదరాబాద్‌లోని ఆ పార్టీ భవనాన్ని పునాదులతో లేపేస్తామని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి హెచ్చరించారు. నల్లగొండలో బుధవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బీఆర్‌ఎస్‌కి చెందిన 30 మంది ఎమ్మెల్యేలు కాంగ్రె్‌సలోకి వస్తామంటున్నారని, కేసీఆర్‌ ఇదేవిధంగా తమ జోలికి వస్తే ముగ్గురు, నలుగురు బంధువులైన ఎమ్మెల్యేలు మినహా ఆ పార్టీలో ఎవరూ మిగలరని హెచ్చరించారు. నారాయణపేటలో కేసీఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి రెండు సీట్లు కూడా రావని అన్నారని, ఈ పార్లమెంట్‌ ఎన్నికల్లో బీఆర్‌ఎ్‌సకు ఒక్క సీటు కూడా రాదన్నారు. మెదక్‌లో రూ.1000 కోట్లు ఖర్చు పెట్టినా బీఆర్‌ఎస్‌ గెలవదని జోస్యం చెప్పారు. జడ్పీటీసీగా, ఎమ్మెల్సీగా స్వతంత్రంగా గెలవడంతో పాటు ఎంపీగా, ఎమ్మెల్యేగా గెలిచిన ఓ రైతు బిడ్డ రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడని, అలాంటి నాయకుడిని లిల్లీపుట్‌ అంటావా అంటూ మండిపడ్డారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌, బీజేపీ మధ్యనే పోటీ ఉందని, తమ పార్టీ 13 సీట్లను గెలుచుకుంటుందన్నారు. కవితకు రెండేళ్ల వరకు బెయిల్‌ వచ్చే ప్రసక్తే లేదన్నారు. ఆమె జైలుకు వెళ్లడంతో తండ్రి కేసీఆర్‌, కుమారుడు కేటీఆర్‌, అల్లుడు హరీ్‌షరావుకు మెంటల్‌ లేచినట్లు ఉందని, అందుకే రేవంత్‌పై ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. త్వరలో చర్లపల్లి జైలుకు రావులు అంతా వెళతారని, ప్రభాకర్‌రావు మొదలుకుని తారక రామా రావు వరకు వెళితే తమ ముఖ్యమంత్రి రేవంత్‌ చెప్పినట్లుగా ఒక డబుల్‌ బెడ్‌ రూం ఇల్లు సరిపోదని, ఎన్ని ఇళ్లు కట్టాల్సి వస్తుందోనని ఎద్దేవా చేశారు. తన బండారం ఎక్కడ బయట పడుతుందోనని కేసీఆర్‌ అసెంబ్లీకి రావడం లేదన్నారు. ఒకప్పుడు తిండికి లేని మాజీ మంత్రి జగదీ్‌షరెడ్డి హైదరాబాద్‌లోని షాబాద్‌లో 80 ఎకరాల ఫాంహౌస్‌ సంపాదించాడన్నారు. యాదాద్రి పవర్‌ప్లాంట్‌ అవినీతి, అక్రమాల విషయంలో జగదీ్‌షరెడ్డి జైలుకు వెళ్లడం ఖాయమని స్పష్టం చేశారు. దోచుకోవడానికే పవర్‌ ప్లాంట్‌ అంచనాలు రూ.29 వేల కోట్ల నుంచి రూ.50 వేల కోట్లకు పెంచారని విమర్శించారు. ఎన్నికల కోడ్‌ ముగిసిన తర్వాత రుణమాఫీ అమలు చేస్తామన్నారు.

Updated Date - Apr 18 , 2024 | 04:24 AM