Share News

30న వామపక్ష పార్టీల రాష్ట్ర సదస్సు

ABN , Publish Date - Mar 26 , 2024 | 03:11 AM

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 30న రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహించాలని 11 వామపక్ష పార్టీలు నిర్ణయించాయి. దేశ ప్రజల

30న వామపక్ష పార్టీల రాష్ట్ర సదస్సు

హైదరాబాద్‌, మార్చి25(ఆంధ్రజ్యోతి): కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 30న రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహించాలని 11 వామపక్ష పార్టీలు నిర్ణయించాయి. దేశ ప్రజల సమస్యలను పరిష్కరించడంలో బీజేపీ విఫలమైందని, నియంతృత్వ విధానాలతో ప్రతిపక్ష పార్టీలు పాలిస్తున్న రాష్ట్రాల్లో గవర్నర్‌ వ్యవస్థను తమ స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకుంటోందని విమర్శించాయి. ఈడీ, ఐటీ దాడులతో ప్రతిపక్షాల గొంతు నొక్కుతుందన్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ ప్రభుత్వ ప్రజావ్యతిరేక, మతోన్మాద, కార్పొరేట్‌ విధానాలను నిరసిస్తూ 11 వామపక్ష పార్టీల రాష్ట్ర కమిటీల ఆధ్వర్యంలో మార్చి 30న ఉదయం 10 గంటలకు హైదరాబాద్‌ సుందరయ్య విజ్ఞానకేంద్రంలో రాష్ట్ర సదస్సు నిర్వహించనున్నట్లు సోమవారం ఒక ప్రకటనలో తెలిపాయి.

Updated Date - Mar 26 , 2024 | 03:11 AM