Share News

మన బిడ్డల భవిష్యత్తు కోసం బరిలో నిలిచా

ABN , Publish Date - Apr 16 , 2024 | 11:22 PM

మాదిగ బిడ్డల బంగారు భవిష్యత్తు కోసం పార్లమెంట్‌ చట్ట సభలకు వెళ్లేందుకు బరిలో నిలిచానని బీఆర్‌ ఎస్‌ నాగర్‌కర్నూల్‌ ఎంపీ అభ్యర్ధి ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌ అన్నారు.

మన బిడ్డల భవిష్యత్తు కోసం బరిలో నిలిచా
సమావేశంలో మాట్లాడుతున్న ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌

- బీఆర్‌ఎస్‌ నాగర్‌కర్నూల్‌ అభ్యర్థి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌

నాగర్‌కర్నూల్‌ టౌన్‌, ఏప్రిల్‌ 16: మాదిగ బిడ్డల బంగారు భవిష్యత్తు కోసం పార్లమెంట్‌ చట్ట సభలకు వెళ్లేందుకు బరిలో నిలిచానని బీఆర్‌ ఎస్‌ నాగర్‌కర్నూల్‌ ఎంపీ అభ్యర్ధి ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌ అన్నారు. మం గళవారం జిల్లా కేంద్రంలోని సాయి గార్డెన్‌లో మాదిగల రాజకీయ ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఫూలే, అంబేడ్కర్‌, బాబుజగ్జీవన్‌రాం జయంతి ఉత్స వాల సందర్భంగా మహనీయుల సభ నిర్వహించారు. మాదిగ ప్రజా సంఘాల రాష్ట్ర నాయకుడు, బీఆర్‌ఎస్‌ జిల్లా నాయకుడు మంగి విజ య్‌ అధ్యక్షతన వహించారు. ఈ సభకు బీఆర్‌ఎస్‌ నాగర్‌కర్నూల్‌ పార్ల మెంట్‌ అభ్యర్థి ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌తో పాటు ఆ పార్టీ జిల్లా అధ్య క్షుడు, అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ముఖ్య అతిథులు గా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌ మాట్లాడు తూ పార్లమెంట్‌ ఎన్నికల గురించి మాదిగ సామాజిక వర్గాలకు ఇంకా సరైన అవగాహన లేని దయనీయ స్థితిలో గడుపుతున్నారని, దీనికి కారణం మనలో రాజకీయ చైతన్యం లేకపోవడమేనన్నారు. అంబేడ్కర్‌, ఫూలే, జగ్జీవన్‌రామ్‌ వంటి మహనీయుల ఆశయ సాధన కోసం తాను రాజకీయాల్లోకి వచ్చానన్నారు. కాంగ్రెస్‌, బీజేపీ, బీఎస్పీ ఒక్కటై మాదిగ బిడ్డనైన నన్ను ఓడించాలని చూస్తున్నారన్నారు. ఆయా పార్టీల జెండా, ఎజెండాల వెనుకాల ఉన్న కుట్రలను గుర్తించి బీఆర్‌ఎస్‌ అభ్యర్ధిగా తన ను గెలిపించాలని ఆయన కోరారు. గువ్వల బాలరాజు మాట్లాడుతూ పా ర్లమెంట్‌ ఎన్నికల్లో ఒక్క టికెట్‌ కూడా కేటాయించకుండా నామినేటెడ్‌ ప దవులిస్తామని మాదిగలను మభ్యపెడుతున్న కాంగ్రెస్‌ పార్టీకి ఓట్లడిగే నైతిక హక్కు లేదన్నారు. సమావేశంలో నాయకులు జోగు ప్ర దీప్‌, ఐతోలు లక్ష్మయ్య, కళాకారులు గిద్ద రాంనర్సయ్య, రేలారే గంగ, మాదిగ ప్రజా సంఘాల నాయకులు ఎదిరేపల్లి కాశన్న పాల్గొన్నారు.

Updated Date - Apr 16 , 2024 | 11:22 PM