Share News

అరటి పండ్లు విక్రయిస్తూ ఎస్‌ఎ్‌సఏ ఉద్యోగుల నిరసన

ABN , Publish Date - Dec 27 , 2024 | 12:16 AM

సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులర్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ ఎస్‌ఎ్‌సఏ ఉద్యోగుల చేపట్టిన సమ్మె గురువారం నాటికి 17వ రోజుకు చేరుకుం ది.

 అరటి పండ్లు విక్రయిస్తూ ఎస్‌ఎ్‌సఏ ఉద్యోగుల నిరసన
కలెక్టరేట్‌ ఎదుట అరటిపండ్లు విక్రయిస్తూ నిరసన తెలుపుతున్న సమగ్ర శిక్ష ఉద్యోగులు

అరటి పండ్లు విక్రయిస్తూ ఎస్‌ఎ్‌సఏ ఉద్యోగుల నిరసన

నల్లగొండ, డిసెంబరు26(ఆంధ్రజ్యోతి): సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులర్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ ఎస్‌ఎ్‌సఏ ఉద్యోగుల చేపట్టిన సమ్మె గురువారం నాటికి 17వ రోజుకు చేరుకుం ది. ఉద్యోగులందరూ కలెక్టరేట్‌ కార్యాలయం వ ద్ద అరటిపండ్లను అమ్ముతూ నిరసన వ్యక్తం చే శారు. 17 రోజుల నుంచి వినూత్నంగా నిరసన వ్యక్తం చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం ఆశ్చర్యంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్ర భుత్వం వెంటనే స్పందించి తమ సేవలను గు ర్తించి ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో జిల్లా సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యద ర్శులు మొలుగూరు కృష్ణ, బొమ్మగాని రాజు, గు మ్మల మంజుల, నీలాంబరి, వసంత, యాద య్య, నాగరాజు, వెంకటకృష్ణ, పుష్పలత, నాగభూషణాచారి, రాజేంద్రప్రసాద్‌, వి.సైదులు, ఖా న, బిక్షం, చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 27 , 2024 | 12:16 AM