Share News

వేగంగా విమాన రాజగోపురం పనులు

ABN , Publish Date - Dec 31 , 2024 | 12:25 AM

యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ దివ్య విమాన రాజగోపురం స్వర్ణ తాపడం పనులు వేగంగా సాగుతు న్నాయని ఈవో ఏ. భాస్కర్‌రావు తెలిపారు.

వేగంగా విమాన రాజగోపురం పనులు
పూజలు నిర్వహిస్తున్న అర్చకుడు

కొత్త ఏడాది జనవరి 10న ముక్కోటి వేడుకలకు సిద్ధం

భక్తులకు వసతుల కల్పనకు ఏర్పాట్లు : ఈవో భాస్కర్‌రావు

భువనగిరి అర్బన్‌, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ దివ్య విమాన రాజగోపురం స్వర్ణ తాపడం పనులు వేగంగా సాగుతు న్నాయని ఈవో ఏ. భాస్కర్‌రావు తెలిపారు. దేవస్థానం అనువంశిక ధర్మకర్త నరసింహ మూర్తితో కలిసి అతిథి గృహంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 11,150 చదరపు అడుగుల విస్తీర్ణంలో పనులు సాగుతున్నాయని, ఇప్పటికి 3,800 చదరపు అడుగుల పనులు పూర్తయ్యాయని తెలిపారు. ఇంకా ఐదు వేల అడుగుల బంగారు తొడుగులు సిద్ధంగా ఉన్నాయన్నారు. ప్రభుత్వ ఆదేశాల మే రకు గతంలో ధ్వజస్తంభం, ముఖద్వారానికి తాపడం పనులు చెన్నైకి చెందిన మెసర్స్‌ స్మార్ట్‌ క్రియేషన్‌ సంస్థకు అప్పగించినట్లు వివరించారు. 50ఏళ్ల పాటు మన్నికగా ఉండే విధంగా తీర్చిదిద్దుతున్నామని, నాణ్యతలో లోపం లేకుండా పారదర్శకంగా పనులు సాగుతున్నాయని ఆయన స్పష్టం చేశారు. స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ముందుగానే విమాన గోపురానికి సంప్రోక్షణ చేస్తామన్నారు. 2025 జనవరి 20వ తేదీ వరకు దాతలు విరాళాలు అందజేసే గడువు ఉందని తెలిపారు. బంగారు తాపడానికి అధిక సంఖ్యలో భక్తులు విరాళాలు అందజేయాలని కోరారు. గోపురం స్వర్ణమయం అయ్యేందుకు 65నుంచి 66కిలోల బంగారు అవసరం ఉంద న్నారు. ఇప్పటి వరకు భక్తుల ద్వారా రూ.21.38కోట్ల నగదు, 10కిలోల బంగారం సమకూరినట్లు వెల్లడించారు. తిరుమల మాదిరిగా యాదగిరిగుట్ట దేవస్థానాన్ని పూర్తి ఆన్‌లైన్‌ చేయాలనే యోచి స్తున్నట్లు తెలిపారు. భక్తుల జన్మదినం సందర్భంగా సంకల్పం చేసి 1,200మంది భక్తులకు అన్న ప్రసాదం అందజేసే దాతలు పేర్లు ఫ్లెక్సీల్లో ప్రదర్శిస్తామన్నారు. పాత ఆచారాలను పునరుద్ధరించి భక్తుల మనోభావాలు కాపాడేందుకు చర్యలు తీసుకుం టున్నట్లు తెలిపారు. ఆలయ ప్రాశస్త్యం పెంచేలా సాంస్కృతిక కార్యకలాపాల ద్వారా నృత్య, సంగీత విభావరీలు నిర్వహిస్తున్నామన్నారు. భక్తులు సేద తీరేందుకు షెడ్డు ఏర్పాటు చేశామన్నారు. ప్రసాద టికెట్‌, ప్రసాదాలు వేర్వేరుగా ఇచ్చేందుకు కొత్తగా ప్రవేశపెట్టిన విధానాల ద్వారా రెండు నెలల్లోనే రూ.1.20కోట్ల ఆదాయం సమకూరి ందన్నారు. 2024సంవత్సరంలో 1.17కోట్ల మంది భక్తులు స్వామివారిని దర్శించుకు న్నట్లు తెలిపారు. అసంపూర్తిగా ఉన్న అన్నదాన భవనం జనవరి 15న అందుబాటులోకి వస్తుందన్నారు. 2025 నూతన సంవత్సరం రోజున భక్తులు అధిక సంఖ్యలో స్వామి వారిని దర్శించుకునేందుకు రానున్న అంచనాలతో అన్ని ఏర్పాటు ఇప్పటికే పూర్తి చేశామన్నారు. జనవరి 10న ముక్కోటి ఏకాదశి వేడుకలు 5.15గంటలకు స్వామివారి ఉత్తరద్వార దర్శనం కల్పించనున్నట్లు వెల్లఢించారు. ఆ రోజు బ్రేక్‌ దర్శనం రద్దు చేయ గా ప్రత్యేక, ధర్మదర్శనాల ద్వారా స్వామివారి దర్శంచుకునేందుకు సిద్ధం చేశామన్నారు.

హరిహరులకు విశేష పూజలు

యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామివారి కొండపైన సోమవారం హరిహరులకు విశేష పూజలు కొనసాగాయి. స్వయంభు స్వామి అమ్మవారికి శ్రీవైష్ణవ పాంచ రాత్ర గమరీతిలో, పర్వతవర్ధిని రామలింగేశ్వరస్వామివారికి శైవాగమశాస్త్రరీతిలో నిత్య కైంక ర్యాలు నిర్వహించారు. ప్రధానాలయంలో సుప్రభాత సేవాతో స్వామి అమ్మవారిని మే ల్కొలిపిన అర్చకస్వాములు మూలమూర్తులను వేదమంత్ర పఠనాలు, పంచామృ తాలతో అభిషేకించి, తులసి దళాలతో అర్పించారు. సాయంత్రం వేల అలంకార వెండిజోడు సేవలు, సహస్రనామార్చనలు ఆగమశాస్త్రరీతిలో కొనసా గాయి. శివాలయంలోని ముఖమండపంలో స్ఫటికమూర్తును అర్చకులు వేదమంత్ర పఠనాలు, మంగళవాయిద్యాల మధ్య పంచామృతాలతో అభిషేకించారు. ఆలయ ఖజానాకు రూ. 22,75,735ల ఆదాయం సమకూరినట్లు ఈవో భాస్కర్‌రావు తెలిపారు. స్వామివారి దివ్యవిమాన గోపురానికి స్వర్ణతాపడం కోసం రాఘవచార్యులు లక్ష్మీదేవి దంపతులు, కొడుమగుళ్ల దామోదర చార్య రూ.2,54,348 డీడీని ఈవోకు అందజేశారు.

Updated Date - Dec 31 , 2024 | 12:25 AM