Share News

ఎయిర్‌పోర్టు రోడ్డులో స్పీడ్‌ 80 దాటితే ఫైన్‌

ABN , Publish Date - Feb 06 , 2024 | 04:32 AM

శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎయిర్‌పోర్టు అప్రోచ్‌ రోడ్డులో వాహనాల వేగ నియంత్రణకు శ్రీకారం చూట్టారు. ఈ నెల 7

ఎయిర్‌పోర్టు రోడ్డులో స్పీడ్‌ 80 దాటితే ఫైన్‌

రేపటి నుంచే అమలు.. స్పీడ్‌ గన్‌ల ఏర్పాటు

శంషాబాద్‌ రూరల్‌, ఫిబ్రవరి 5 (ఆంధ్రజ్యోతి): శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎయిర్‌పోర్టు అప్రోచ్‌ రోడ్డులో వాహనాల వేగ నియంత్రణకు శ్రీకారం చూట్టారు. ఈ నెల 7 తేదీ నుంచి అప్రోచ్‌ రోడ్డులో గంటకు 80 కిలోమీటర్ల వేగం మించొద్దని ఆంక్షలు విధిస్తున్నట్లు జీఎంఆర్‌ అధికారులు ప్రకటించారు. ప్రయాణికుల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. అప్రోచ్‌ రోడ్డుపై ఆటోమేటిక్‌ స్పీడ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సిస్టమ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. వాహనదారులందరూ బాధ్యతాయుతంగా డ్రైవింగ్‌ చేయాలని సూచించారు. ట్రాఫిక్‌ పోలీసులతో సమన్వయం చేసుకుని ఈ వేగ పరిమితిని అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు.

Updated Date - Feb 06 , 2024 | 04:32 AM