Share News

శ్రీరామ పాదుకలకు ప్రత్యేక పూజ

ABN , Publish Date - Jan 07 , 2024 | 12:15 AM

త్వరలో అయోధ్య రామాలయంలో వినియోగించే శ్రీరాముడి పాదుకలకు యాదాద్రిభువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలోని హరిహర త్రిశక్తి క్షేత్రంలో వేదపండితులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు.

శ్రీరామ పాదుకలకు ప్రత్యేక పూజ
Special Puja to Lord Rama Padukas

వలిగొండ, జనవరి 6 : త్వరలో అయోధ్య రామాలయంలో వినియోగించే శ్రీరాముడి పాదుకలకు యాదాద్రిభువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలోని హరిహర త్రిశక్తి క్షేత్రంలో వేదపండితులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. కర్ణాటక రాష్ట్రం నుంచి పాదుకలతో రథయాత్రగా బయలుదేరిన ప్రత్యేక వాహనం శనివారం వలిగొండకు చేరింది. గోవింద నామస్మరణతో దేవాలయంలోకి పాదుకలను తీసుకెళ్లారు. ఈ సందర్భంగా రథయాత్ర బృంద సభ్యుడు బాలాజీ మాట్లాడుతూ మూడేళ్ల క్రితమే ఈ యాత్రను ఆరంభించినట్లు తెలిపారు. కర్ణాటక రాష్ట్రం శృంగేరీ మఠం జగద్గురువులు పాదుకలకు తొలి పూజలు జరిపిన తదుపరి అయోధ్యలో శ్రీరామ పట్టాభిషేకానికి తరలిస్తున్నట్లు వివరించారు. దేశంలో 16 పవిత్ర నదీ జలాలు, నదీ మృత్తికలను కూడా రామయ్య చెంతకు తీసుకెళ్తున్నామన్నారు. కోటి ఇళ్లలో పూజలు జరిపిన తదుపరి అయోధ్యకు చేరుస్తున్నట్లు తెలిపారు. కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ, తెలంగాణ రాష్ట్రాల్లో పలు దేవాలయాల్లో పూజలు నిర్వహించినట్లు తెలిపారు. ఈ నెల 20న అయోధ్యకు ఈ యాత్ర చేరుతుందని వివరించారు. కార్యక్రమంలో సర్పంచ బోళ్ల లలితాశ్రీనివాస్‌, దేవాలయ నిర్వాహకులు గోపాలకృష్ణ, మనోహరి, అర్చకులు దత్తాత్రేయ శర్మ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 07 , 2024 | 12:15 AM