యూఏఈలోని భారత కార్మికులకు ప్రత్యేక బీమా
ABN , Publish Date - Mar 06 , 2024 | 04:26 AM
దుబాయ్ సహా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని వివిధ ఎమిరేట్లలో పనిచేస్తున్న ప్రవాస భారతీయ కార్మికుల సంక్షేమం కోసం దుబాయిలోని భారతీయ కాన్సులేట్

సహజ మరణాలకూ వర్తింపు
దుబాయ్‌లోని భారత కాన్సులేట్
(ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి)
దుబాయ్ సహా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని వివిధ ఎమిరేట్లలో పనిచేస్తున్న ప్రవాస భారతీయ కార్మికుల సంక్షేమం కోసం దుబాయిలోని భారతీయ కాన్సులేట్ లైఫ్ ప్రొటెక్షన్ ప్లాన్(ఎల్‌పీపీ) అనే వినూత్న పథకాన్ని ప్రకటించింది. ఇది సహజమరణాలకు కూడా వర్తించనుంది. సహజ, ప్రమాద మరణాలకు ఈ పథకం కింద రూ.8లక్షల నుంచి రూ.16 లక్షల వరకు బీమా లభిస్తుందని భారతీయ కాన్సుల్ జనరల్ సతీశ్ ఒక ప్రకటనలో వెల్లడించారు. ఓరియంట్, గార్గశ్ బీమా కంపెనీలు దీన్ని సంయుక్తంగా అమలు చేస్తాయన్నారు. చట్టబద్ధ ఉపాధి వీసా కింద యూఏఈ వెళ్లిన 18-70ఏళ్ల లోపు భారతీయులు ఈ పథకానికి అర్హులు. ఈ కార్మికులు సెలవులపై భారతదేశంలో ఉన్నప్పుడు కూడా పాలసీ వర్తిస్తుంది. కార్మికుల మృతదేహాలను పంపించడానికి రూ.2.70లక్షలు చెల్లించేలా పాలసీ లో నిబంధనలున్నాయి. గడిచిన రెండేళ్లలో దుబాయిలోని భారత కాన్సులేట్ 2,613 మరణాలు నమోదు చేయగా అందులో 90ు సహజమరణాలే అని తేలింది.