Share News

విద్య, వైద్యంపై ప్రత్యేక దృష్టి

ABN , Publish Date - Nov 28 , 2024 | 12:03 AM

విద్య, వైద్యంపై ప్రత్యేక దృష్టి పెట్టడం జరుగుతుందని, పాఠశాలలో మూవీక్లబ్‌ ఏర్పాటు చేయాలనే ఆలోచన ఉందని కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి ప్రతీక్‌ జైన్‌ తెలిపారు.

విద్య, వైద్యంపై ప్రత్యేక దృష్టి
తుంకిమెట్లలో విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేస్తున్న జిల్లా కలెక్టర్‌

ఇకపై ప్రభుత్వ పాఠశాల ఆకస్మిక తనిఖీలు

ప్రతి సోమవారం మంచినీటి పరీక్షలు

- దుద్యాల్‌కు తహసీల్దార్‌ కార్యాలయం మంజూరు

- దుద్యాల్‌, చౌడపూర్‌కు మండల పరిషత్‌ కార్యాలయాలు

- మోడల్‌ పీహెచ్‌సీగా నవాబుపేట ఆసుపత్రి

విలేకరుల సమావేశంలో కలెక్టర్‌ ప్రతీక్‌ జైన్‌

ఇదే ఐటంలో రైతులకు ఇబ్బందులు కలిగించొద్దు (బాక్స్‌ ఇండికేసన్‌ వాడాలి)

ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్‌

వికారాబాద్‌, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి) : విద్య, వైద్యంపై ప్రత్యేక దృష్టి పెట్టడం జరుగుతుందని, పాఠశాలలో మూవీక్లబ్‌ ఏర్పాటు చేయాలనే ఆలోచన ఉందని కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి ప్రతీక్‌ జైన్‌ తెలిపారు. బుధవారం కలెక్టరేట్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భగా ఆయన మాట్లాడుతూ. భవిత సెంటర్ల విషయంలో ఆలోచిస్తున్నామని అందుకు తగ్గ ఏర్పాట్లు చేయడం జరుగుతుందన్నారు. ఈవీఎంలపై ఎలాంటి అపోహాలు, అనుమానాలు అవసరం లేదని, సురిపీం కోర్టు సైతం ఈ విషయం తీర్పు ఇవ్వడం జరిగిందన్నారు. వాటిని ట్యాంపరింగ్‌ చేసే అవకాశం అనేది ఉండదన్నారు. ఈవీఎంలపై అనవసర ఆరోపణలు చేయవద్దన్నారు. ఇకపై జిల్లాలో అన్ని పాఠశాలలో నెలలో రెండు మూడు సార్లు అధికారులు తనిఖీలు చేయడం జరుగుతుందన్నారు. ఇందులో అన్ని శాఖల అధికారులు భాగస్వాములు అవుతారని పంచాయతీ కార్యదర్శి నుంచి ఉన్నత స్థాయి అధికారి వరకు పాఠశాలలను పరిశీలించి విద్యార్థులతో కలిసి భోజనాలు చేయడం జరుగుతుందన్నారు. తాగునీటిపై ప్రత్యేక దృష్టి పెట్టి ప్రతి సోమవారం నీటి పరీక్షలు చేయడం జరుగుతుందన్నారు. మధ్యాహ్న భోజన ఏజెన్సీ నిర్వాహకులకు బిల్లులు రావడం లేదని ఆంధ్రజ్యోతి అడిగిన సమాధానానికి కలెక్టర్‌ స్పందించారు. సెప్టెంబర్‌ వరకు బిల్లులు అందించడం జరిగిందని, మిగిలిన వాటిపై అధికారులతో మాట్లాడడం జరుగుతుందన్నారు. శిథిలావస్థలో ఉన్న వికారాబాద్‌ జిల్లా పరిషత్‌ పాఠశాలకు రూ. 6.50 లక్షల మంజూరు చేసి రిపేర్లు చేయించడం జరుగుతుందన్నారు.

మోడల్‌ పీహెచ్‌సీగా నవాబుపేట

ప్రస్తుతం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కాన్పుల సంఖ్య తగ్గిందన్నారు. అందు కోసం నవాబుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మోడల్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంగా ఎంపిక చేయడం జరిగిందన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కూడా కాన్పులు జరిగే విధంగా అవగాహన కల్పించి సౌకర్యాలు కల్పించడం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్‌ లింగ్యానాయక్‌ ఉన్నారు.

హాస్టల్స్‌, స్కూళ్లలో ఆరోగ్య శిబిరాలు

జిల్లాలోని ప్రభుత్వ హాస్టల్స్‌, స్కూల్స్‌లో వైద్య ఆరోగ్య శిబిరాలు నిర్వహించి, విద్యార్థులకు ఆరోగ్యపరీక్షలు నిర్వహించాలని కలెక్టర్‌ ప్రతీక్‌ జైన్‌ సూచించారు. బుధవారం, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయాన్ని పరిశీలించిన ఆయన, వైద్య అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా శీతాకాలంలో వచ్చే వ్యాధులపై హాస్టల్‌ సిబ్బంది, విద్యార్థులకు తగిన అవగాహన కల్పించాలని సూచించారు. అలాగే, ప్రభుత్వ హాస్టల్స్‌, స్కూళ్లలో విద్యార్థుల ఆరోగ్య పరిస్థితులను పర్యవేక్షించి, అవసరమైన వారికి చికిత్స అందించాలని, అవసరమైన ఔషధాలను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్‌ వెంకటరమణ, డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌వో జీవరాజు తదితరులు పాల్గొన్నారు.

ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్‌

ధాన్యం డబ్బులు త్వరగా చెల్లించాలి

బొంరా్‌సపేట్‌: గన్నీ బ్యాగులు లేక కొనుగోలు నిలిచిపోయాయని బుధవారం ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన కథనానికి కలెక్టర్‌ ప్రతీక్‌జైన్‌ స్పందించారు. బొంరా్‌సపేట్‌ మండల కేంద్రానికి 5వేల గన్నీ బస్తాలను పంపించారు. కలెక్టర్‌ ప్రతీక్‌జైన్‌ బొంరా్‌సపేట్‌తో పాటు బురాన్‌పూర్‌, మెట్లకుంట, తుంకిమెట్ల గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. ఇప్పటి వరకు రైతుల నుంచి సేకరించిన ధాన్యం వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల్లో రైతుల కోసం అన్నీ వసతులను కల్పించాలని సూచించారు. ధాన్యం సేకరించిన తర్వాత వెంటనే లారీల్లో లోడ్‌ చేసి రైస్‌ మిల్లులకు తరలించి ధాన్యం అన్‌లోడ్‌ అయ్యే విధంగా అధికారులు పర్యవేక్షించాలన్నారు. అనంతరం కలెక్టర్‌ ఎంపీడీవో కార్యాలయంలో డాటా ఎంట్రీ ప్రక్రియను పరిశీలించారు. అలాగే తుంకిమెట్ల ప్రాథమిక పాఠశాలను సందర్శించి మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మధ్యాహ్న భోజన పథకాన్ని పకడ్బందీగా అమలు చేసే బాధ్యత అధికారులదే అన్నారు. కార్యక్రమంలో జిల్లా సివిల్‌ సప్లయి అధికారి మోహన్‌బాబు, తహసీల్దార్‌ పద్మావతి, ఎంపీడీవో వెంకన్నగౌడ్‌, ఎంపీవో మహేశ్‌కుమార్‌, వ్యవసాయ అధికారిణి తులసి, ఎంఈవో హరిలాల్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 28 , 2024 | 12:03 AM