Share News

సొంతూళ్లకు..Sontūḷlaku.

ABN , Publish Date - Jan 14 , 2024 | 11:18 PM

సంక్రాంతి పండుగకు ప్రజలంతా సొంతూళ్లకు ప్రయాణమయ్యారు. దీంతో రోడ్లన్నీ వాహనాలతో రద్దీగా మారాయి.

సొంతూళ్లకు..Sontūḷlaku.
ఘట్‌కేసర్‌లోని బైపాస్‌ చౌరస్తా వద్ద వాహనాల రద్దీ

ప్రయాణికులతో రద్దీగా రైళ్లు, బస్సులు

భారీగా కదిలిన వాహనాలు, తప్పని ట్రాఫిక్‌ తిప్పలు

ఘట్‌కేసర్‌, జనవరి 14 : సంక్రాంతి పండుగకు ప్రజలంతా సొంతూళ్లకు ప్రయాణమయ్యారు. దీంతో రోడ్లన్నీ వాహనాలతో రద్దీగా మారాయి. మూడు రోజులుగా హైదరాబాద్‌- వరంగల్‌ జాతీయ రహదారి కిటకిట లాడుతున్నది. ఉద్యోగులు, బతుకుదెరువు కోసం నగరంతో పాటు, శివారు ప్రాంతాల్లో నివాసం ఉంటున్న ప్రజలు సంక్రాంతి పండుగను సొంతుళ్లలో జరుపుకునేందుకు తరలివెళ్లారు. దీంతో వరంగల్‌, నల్గొండ, యాదాద్రి-భువనగిరి జిల్లా, సూర్యాపేట, ఖమ్మం తదితర జిల్లాకు వెళ్లాల్సిన వాహనాలతో ఘట్‌కేసర్‌లోని హైదరాబాద్‌ - వరంగల్‌ జాతీయ రహదారి మొత్తం వాహనాల నిండి పోయింది. దీంతో వరంగల్‌, నల్గొండ జిల్లాకు వెళ్లే ఆర్టీసీ బస్సులు, రైళ్లు, ప్రైవెటు వాహనాలు కిక్కిరిసిన ప్రయాణికులతో వెళ్లాయి. పండుగకు సొంతూళ్లకు వెళ్లే వారితో పాటు ఐనవోలు (ఐలేనుమల్లన్న) జాతరకు వెళ్లే వారితో వాహనాల్లో కాలుమోపడానికి సందులేనంతగా నిండిపోయాయి. వాహనాల రద్దీ భారీగా పెరగడంతో ఘట్‌కేసర్‌లోని బైపాస్‌ చౌరస్తాల్లో ట్రాఫిక్‌ స్తంభించిపోయింది. ప్రధానంగా జాతీయ రహదారిపై కార్లరద్దీ భారీగా పెరిగింది.

Updated Date - Jan 14 , 2024 | 11:18 PM