సామాజిక సేవే ఐవీఎఫ్ లక్ష్యం : శ్రీనివాస్‌గుప్తా
ABN , Publish Date - Jun 24 , 2024 | 12:15 AM
సామాజిక సేవే ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ (ఐవీఎఫ్) లక్ష్యమని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్తా అన్నారు.
ఆలేరు రూరల్, జూన్ 23: సామాజిక సేవే ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ (ఐవీఎఫ్) లక్ష్యమని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్తా అన్నారు. ఆలేరులో ఆదివారం జరిగిన సంఘం జిల్లా సమావేశం, నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారోత్సవంలో మాట్లాడారు. గాంధీ కలలను సాకారం చేయడమే తమ ముందున్న లక్ష్యమన్నారు. పీజీసీ సెల్‌లో రాష్ట్రస్థాయి ప్రథమ ర్యాంక్ సాధించిన మోట కొండూరు మండలం అమ్మనబోలు గ్రామానికి చెందిన చిట్టమల్ల సంధ్యను సన్మానించారు. పలు కుటుంబాలకు ఉచితంగా కుట్టు మిషన్లను అందజేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు గొంగిడి సునీత, బూడిద భిక్షమయ్య గౌడ్, ఐవీఎఫ్ రాష్ట్ర జిల్లా, మండల పట్టణ నాయకులు పబ్బ చంద్రశేఖర్ గుప్త, కె. నారాయణ, కె. శ్రీనివాస్, స్వప్న, భాగ్యలక్ష్మీ, మంజూల, సంతోష్‌కుమార్, వంగపల్లి ఆంజనేయస్వామి, సముద్రాల కల్పన, లక్ష్మణ్, సత్యం, సంతోష్, రమేష్, ఈశ్వర్, వరప్రసాద్, అశోక్, సందీప్, తదితరులు ఉన్నారు.