అడవిదేవులపల్లిలో సామాజిక తనిఖీ
ABN , Publish Date - Jul 05 , 2024 | 12:17 AM
మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో గురువారం ఎంజీఎనఆర్‌ఈజీఎ్‌స మూడవ విడత సామాజిక తనిఖీ (ఓపెన ఫోరం) నిర్వహించారు

అడవిదేవులపల్లిలో సామాజిక తనిఖీ
అడవిదేవులపల్లి, జూలై 4: మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో గురువారం ఎంజీఎనఆర్‌ఈజీఎ్‌స మూడవ విడత సామాజిక తనిఖీ (ఓపెన ఫోరం) నిర్వహించారు ఈ సందర్భంగా ఎంపీడీవో క రుణాకర్‌రావు మాట్లాడుతూ 1 ఏప్రిల్ 2023 నుంచి 31 మార్చి 2024 వరకు జ రిగిన ఉపాధి హామీ పనులు మొత్తం రూ. 2,25,36,998కు జరిగిన పనులు ని ర్వహించినట్లు తెలిపారు. అడిషనల్ పీడీ నవీనకుమార్ ఆధ్వర్యంలో వారం రో జుల నుంచి మండల పరిధిలోని 13 గ్రామపంచాయతీల్లో రికార్డులను పరిశీలించినట్లు పేర్కొన్నారు. ఎనఆర్‌ఈజీఎ్‌స పనులపై, నర్సరీల్లో మొక్కల పెంపకంపై ఆయన పంచాయతీ కార్యదర్శులకు, టీఏలకు, ఎఫ్‌ఏలకు పలు సూచనలు చేశా రు. కార్యక్రమంలో జిల్లా విజిలెన్స అఽధికారి వేణుగోపాల్‌రావు, ఏపీవో సూరానాయక్, ఎంపీవో మోసినబీనఅహ్మద్, టీఏలు, పంచాయతీ కార్యదర్శులు, ఎఫ్‌ఏలు, ఉపాధి సిబ్బంది పాల్గొన్నారు.