Share News

ఏసీ బస్సుల్లో స్నాక్స్‌ బంద్‌ : TSRTC

ABN , Publish Date - May 09 , 2024 | 05:12 AM

దూర ప్రాంతాలకు వెళ్లి వచ్చే ఏసీ బస్సుల్లో మే 15 నుంచి ప్రయాణికులకు అందించే స్నాక్స్‌ను నిలిపివేస్తున్నట్టు టీఎ్‌సఆర్టీసీ ప్రకటించింది. టికెట్‌ చార్జీతో పాటు అదనంగా రూ.30 వసూలు చేస్తూ

ఏసీ బస్సుల్లో స్నాక్స్‌ బంద్‌ : TSRTC

దూర ప్రాంతాలకు వెళ్లి వచ్చే ఏసీ బస్సుల్లో మే 15 నుంచి ప్రయాణికులకు అందించే స్నాక్స్‌ను నిలిపివేస్తున్నట్టు టీఎ్‌సఆర్టీసీ ప్రకటించింది. టికెట్‌ చార్జీతో పాటు అదనంగా రూ.30 వసూలు చేస్తూ ఆర్టీసీ ప్రయాణికులకు స్నాక్స్‌ సమకూర్చుతోంది. స్నాక్స్‌లో భాగంగా వాటర్‌బాటిల్‌తో పాటు సమోసా, కచోరి స్వీట్‌ను సరఫరా చేస్తున్నారు. అయితే బస్సులు బయలుదేరే సమయంలో తాజా స్నాక్స్‌ను ఆయా బస్‌స్టేషన్లలో నిల్వ చేయడం అధికారులకు సవాల్‌గా మారింది. అలాగే ప్రయాణికులు స్నాక్స్‌ స్వీకరించిన తర్వాత కవర్‌లు, ఆహార పదార్థాలు బస్సు సీట్లపై అపరిశుభ్రంగా పడేస్తున్నారనే ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకుని స్నాక్స్‌ సరఫరాను నిలిపివేయాలని ఆర్టీసీ నిర్ణయించినట్టు తెలిసింది.

Updated Date - May 09 , 2024 | 08:27 AM