Share News

జన్మభూమి సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రె్‌సలో పొగలు

ABN , Publish Date - Feb 15 , 2024 | 12:08 AM

: సికింద్రాబాద్‌ నుంచి విశాఖపట్టణం వెళుతున్న జన్మభూమి సూపర్‌ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులో పొగలు రావడంతో నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో 25నిమిషాలు నిలిపారు.

జన్మభూమి సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రె్‌సలో పొగలు
మిర్యాలగూడ రైల్వేస్టేషన్‌లో నిలిచి ఉన్న జన్మభూమి సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు

మిర్యాలగూడటౌన్‌, ఫిబ్రవరి 14: సికింద్రాబాద్‌ నుంచి విశాఖపట్టణం వెళుతున్న జన్మభూమి సూపర్‌ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులో పొగలు రావడంతో నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో 25నిమిషాలు నిలిపారు. సికింద్రాబాద్‌ నుంచి బుధవారం ఉదయం 7.10గంటలకు బయలుదేరిన జన్మభూమి సూపర్‌ఫాస్ట్‌ ట్రైన్‌ ఉదయం 9 గంటల సమయంలో కుక్కడం స్టేషన్‌ దాటుతుండగా రిజర్వేషన్‌ బోగీ(డీ3) కింది నుంచి పొగలు వచ్చాయి. వెంటనే గమనించిన ప్రయాణికులు రైల్వేసిబ్బందికి సమాచారం అందజేశారు. అప్పటికే మిర్యాలగూడ స్టేషన్‌ సమీపించగా సిబ్బంది రైలును మిర్యాలగూడ స్టేషన్‌లో నిలిపివేశారు. పొగలు వచ్చిన ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించిన నిపుణులు వీల్‌ బేరింగ్‌లలో సాంకేతిక లోపాన్ని గుర్తించి మరమ్మతులు చేశారు. 25నిమిషాల అనంతరం జన్మభూమి సూపర్‌ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ విశాఖపట్టణం బయలుదేరింది.

Updated Date - Feb 15 , 2024 | 12:08 AM