సదరం సర్టిఫికెట్ల కోసం 17 నుంచి స్లాట్ బుకింగ్
ABN , Publish Date - Feb 14 , 2024 | 11:46 PM
దివ్యాంగులు, బుద్ది మాంధ్యం, చెవుడు మూగ వారు సదరం సర్టిఫికెట్ల కోసం నెల 17వ తేదీ శనివారం ఉదయం 11 గంటల నుంచి మీసేవ కేంద్రాల్లో స్లాట్ బుక్ చేసుకోవాలని కలెక్టర్ నారాయణరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.
జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి
వికారాబాద్, ఫిబ్రవరి 14: దివ్యాంగులు, బుద్ది మాంధ్యం, చెవుడు మూగ వారు సదరం సర్టిఫికెట్ల కోసం నెల 17వ తేదీ శనివారం ఉదయం 11 గంటల నుంచి మీసేవ కేంద్రాల్లో స్లాట్ బుక్ చేసుకోవాలని కలెక్టర్ నారాయణరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 19, 20, 23, 26, 27, మార్చి 8, 9, 16, 19, 30 తేదీల్లో తాండూరు ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహించే క్యాంపులకు స్లాట్ బుక్ చేసుకున్నవారు హాజరుకావాలని తెలిపారు. అదేవిధంగా ఈనెల 20, 21, 23, 27, మార్చి 6, 22, 26, 27 తేదీల్లో వికారాబాద్ కమ్యూనిటీ హెల్త్‌సెంటలో పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. సర్టిఫికెట్ కాలపరిమితి అయిపోయిన వారితో పాటు కొత్తగా స్లాట్ బుక్ చేసుకున్న వారు హాజరు కావాలని సూచించారు.