Share News

ఆరు గ్యారెంటీలు అమలు చేస్తాం

ABN , Publish Date - Feb 01 , 2024 | 12:10 AM

అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలతో పాటు అన్ని హామీలను ప్రభుత్వం నెరవేరుస్తుందని నాగా ర్జునసాగర్‌ ఎమ్మెల్యే కుందూరు జయవీర్‌రెడ్డి అన్నారు.

ఆరు గ్యారెంటీలు అమలు చేస్తాం
గుర్రంపోడులో చెక్కు అందజేస్తున్న ఎమ్మెల్యే జయవీర్‌రెడ్డి

గుర్రంపోడు, జనవరి 31: అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలతో పాటు అన్ని హామీలను ప్రభుత్వం నెరవేరుస్తుందని నాగా ర్జునసాగర్‌ ఎమ్మెల్యే కుందూరు జయవీర్‌రెడ్డి అన్నారు. బుధవారం మండలకేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో కల్యాణలక్ష్మి చెక్కులు అందజే శారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌లో భాగంగా రూ.లక్షతో పాటు తులం బంగారం అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మంచికంటి వెంకటేశ్వర్లు, మాజీ జడ్పీటీసీ గాలి రవికుమార్‌, నాయకులు తగుళ్ల సర్వయ్యయాదవ్‌, సూదిని జగదీష్‌రెడ్డి, ఎంపీటీసీ కుప్ప రాములు, చనమళ్ల జగదీష్‌రెడ్డి, కంచర్ల వెంకటేశ్వర్‌రెడ్డి, రంగినేని నర్సింహారావు, కరుణాకర్‌రావు, యాదగిరిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

తాగునీటి ఎద్దడిలేకుండా చర్యలు తీసుకోవాలి : బాలునాయక్‌

దేవరకొండ: మండలంలోని గ్రామాలు, తండాల్లో తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే నేనావత్‌ బాలునాయక్‌ అధికారులను కోరారు. మండలం మైనంపల్లి, మర్రిచెట్టుతండా, తాటికోలు, పడ్మట్‌పల్లి గ్రామాల్లో అభివృద్ధి పనులను ప్రారంభించి మాట్లాడారు. వేసవిని దృష్టిలో ఉంచుకొని మిషన్‌భగీరథ ద్వారా అన్ని గ్రామాలు, తండాలకు కృష్ణాజలాలు సరఫరా చేయాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ జాన్‌యాదవ్‌, తాటికోల్‌ సర్పంచ్‌ జూలూరి బాలనారాయణధనలక్ష్మీగౌడ్‌, లోకసాని శ్రీధర్‌రెడ్డి, డాక్టర్‌ వేణుధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

చింతపల్లి: గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే నేనావత్‌ బాలునాయక్‌ అన్నారు. మండలంలోని ఉప్పరపల్లి, ఘడియగౌరారం, రోటిగడ్డతండా, గొడుకొండ్ల, వీటీనగర్‌లలో అభివృద్ధి పనులను శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో రెండు గ్యారంటీలను ఇప్పటికే అమలు చేసినట్లు తెలి పారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు అంగిరేకుల నాగభూషణం, ఎంపీపీ కొండూరు భవానిపవన్‌కుమార్‌, ఎంపీడీవో ఎల్‌. రాజు, పంచాయతీరాజ్‌ డీఈ జీవన్‌సింగ్‌, డీసీసీ ఉపాధ్యక్షులు దొంతం సంజీవరెడ్డి, అంగిరేకుల గోవర్ధన్‌, రాటకొండ నరేంద్ర ప్రసాద్‌, కాయితి జితేందర్‌రెడ్డి, ఎరుకుల వెంకటయ్యగౌడ్‌, ముచ్చర్ల యాదగిరి, యాచారపు యాదయ్యగౌడ్‌, ఎండీ. ఖలీల్‌బేగ్‌ తదితరులు పాల్గొన్నారు.

ప్రైవేట్‌ పాఠశాలలకు దీటుగా బోధించాలి : రాజగోపాల్‌రెడ్డి

మర్రిగూడ: ప్రైవేట్‌ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు బోధించాలని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. మండలంలోని మోడల్‌ స్కూల్‌లో పదో తరగతి చదువుతున్న విద్యార్ధులకు మండలకేంద్రానికి చెందిన మాల్‌ మార్కెట్‌ మాజీ చైర్మన్‌ పాల్వాయి అనిల్‌రెడ్డి సహకారంతో సమకూర్చిన స్టడీ మెటీరియల్స్‌ను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. మోడల్‌ స్కూల్‌లో చదువుతున్న విద్యార్ధిని, విద్యార్ధులకు మరుగుదొడ్లు అస్తవ్యస్తంగా ఉన్నాయని, కంప్యూటర్‌ గది ఉన్నప్పటికి కంప్యూటర్‌తో పాటు బోధకులు ఎవరూ లేరని, తరుచూ పాఠశాలలోకి కోతులు వచ్చి భయబ్రాంతులకు గురి చేస్తున్నాయని సమస్యలతో పాటు మౌలిక వసతులను పరిష్కరించాలంటూ విద్యార్థులు ఎమ్మెల్యేకు విన్నవించారు. రెండు రోజుల్లో సమస్యలు పరిష్కరిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. విద్యార్థిని తపస్సీ బేగం ఇంగ్లీష్‌లో ధారాళంగా మాట్లాడడంతో ఎమ్మెల్యే అభినందించారు. ప్రభుత్వ పాఠశాలలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ శివ స్వరూపరాణి, వెంకటేశ్వర్లు, అభిలాష్‌, ఆంజనేయులు, ప్రవీణ్‌, ఎంపీపీ మెండు మోహన్‌రెడ్డి, జడ్పీటీసీ పాశం సురేందర్‌రెడ్డి, సర్పంచ్‌ నల్ల యాదయ్యగౌడ్‌, ఎస్‌ఎంసీ చైర్మన్‌ క్రిష్ణ, ఎంపీడీవో వెంకటేశ్వర్‌రావు, తహసీల్దార్‌ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

జగదీష్‌రెడ్డి వ్యాఖ్యలు అహంకారపూరితం : వీరేశం

నార్కట్‌పల్లి,నకిరేకల్‌, కట్టంగూరు: మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డిపై సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్‌రెడ్డి వ్యాఖ్యలు ఆహంకార పూరితమైనవని నకిరేకల్‌ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. నార్కట్‌పల్లి మండలం గోపాలయపల్లిలో గ్రామపంచాయతీ భవనాన్ని బుధవారం ప్రారంభించారు. నకిరేకల్‌ పట్టణ సుందరీకరణే లక్ష్యమని ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. పట్టణంలో జరిగిన మాస్టర్‌ ప్లాన్‌ పునర్విభజన సమావేశంలో మాట్లాడారు. గత పాలకులు పట్టించుకోకపోవడంతోనే పట్టణంలో రోడ్లు, డ్రైనేజీ సమస్యలు ఉన్నాయన్నారు. కట్టంగూరు మండల ంలోని ముత్యాలమ్మగూడెం గ్రామపంచాయతీ పరిధి సవుళ్లగూడెంలో సీసీరోడ్డు, డ్రైనేజీ నిర్మాణానికి ఎమ్మెల్యే వీరేశం శంకుస్థాపన చేశారు.

కార్యకర్తలకు అండగా ఉంటాం : ఎమ్మెల్యే సామేలు

శాలిగౌరారం: కాంగ్రెస్‌ పార్టీ బలోపేతానికి కృషిచేసిన ప్రతి కార్యకర్తకు పార్టీ అండగా ఉంటుందని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్‌ అన్నారు. మండలంలోని ఉట్కూరు గ్రామానికి చెందిన కాంగ్రెస్‌ కార్యకర్త బొమ్మగాని లింగయ్య కుటుంబానికి రూ.2లక్షల బీమా చెక్కును అందజేశారు. కుటుంబాలను పార్టీ అన్ని రకాలుగా ఆదుకుంటుందన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు కందాల సమరంరెడ్డి, కుర్ర లింగయ్య, పాకాల సతీష్‌, వేముల గోపినాథ్‌, రంగు భిక్షంగౌడ్‌, శీలం శంకర్‌, దేవనబోయిన సైదులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 01 , 2024 | 12:10 AM