ఇసుక డంపుల సీజ్
ABN , Publish Date - Jan 12 , 2024 | 11:47 PM
అక్రమంగా నిల్వ ఉంచిన ఇసుక డంపులను బొంరా్‌సపేట్ ఎస్‌ఐ శంకర్ సీజ్ చేశారు. మహంతీపూర్ గ్రామపరిధిలో వ్యవసాయ పొలాల్లో అక్రమంగా నిల్వ ఉంచిన నాలుగు ట్రాక్టర్ల ఇసుకను గుర్తించారు.

బొంరా్‌సపేట్, జనవరి 12: అక్రమంగా నిల్వ ఉంచిన ఇసుక డంపులను బొంరా్‌సపేట్ ఎస్‌ఐ శంకర్ సీజ్ చేశారు. మహంతీపూర్ గ్రామపరిధిలో వ్యవసాయ పొలాల్లో అక్రమంగా నిల్వ ఉంచిన నాలుగు ట్రాక్టర్ల ఇసుకను గుర్తించారు. వీఆర్‌ఏల సహకారంతో డంపులను సీజ్ చేసి రెవెన్యూ అధికారులకు అప్పగించినట్లు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.
కులకచర్ల: అనుమతి లేకుండా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్‌ను కులకచర్ల పోలీసులు సీజ్ చేశారు. శుక్రవారం ఉదయం మండలంలోని చాపలగూడెం గ్రామసమీపంలో ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్‌ను తనిఖీ చేశారు. అనుమతి పత్రాలు లేకపోవడంతో ట్రాక్టర్‌ను సీజ్ చేశారు. డ్రైవర్ బాలుపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ శ్రీశైలం తెలిపారు.