Share News

డ్రగ్స్‌, సైబర్‌ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి

ABN , Publish Date - Sep 21 , 2024 | 11:58 PM

డ్రగ్స్‌, సైబర్‌ నేరాలపై అవగాహన ఉండాలని ఎస్‌ఐ. చలిగంటి నరేష్‌ అన్నారు.

డ్రగ్స్‌, సైబర్‌ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి
గరిడేపల్లిలో మాట్లాడుతున్న ఎస్‌ఐ నరేష్‌

గరిడేపల్లి, సెప్టెంబరు 21: డ్రగ్స్‌, సైబర్‌ నేరాలపై అవగాహన ఉండాలని ఎస్‌ఐ. చలిగంటి నరేష్‌ అన్నారు. మండల పరిధిలోని కీతవారిగూడెం జిల్లాపరిషత్‌ ఉన్నత పాఠశాల విద్యార్థులకు పోలీసు కళాబృందం ఆధ్వర్యంలో శనివారం అవగాహన కల్పించారు. గంజాయి, డ్రగ్స్‌, మత్తు మందులు, గుట్కాలు ప్రమాదకరమన్నారు. విద్యార్థులు ఇంటర్‌నెట్‌ను సద్వినియోగం చేసుకోవాలని, సైబర్‌ మోసగాళ్ల ఉచ్చులో పడొద్దని సూచించారు. బ్యాంక్‌ ఖాతా, ఏటీఎం పిన్‌ నెంబర్లు, ఓటీపీ వివరాలు చెప్పవద్దన్నారు. ఆశచూపిస్తే వాటికి ఆకర్షితులు కావొద్దని సూచించారు. సైబర్‌ మోసాలకు గురైతే వెంటనే టోల్‌ఫ్రీ నెంబర్‌ 1930కు కాల్‌ చేయాలని సూచించారు. వ్యక్తిగత ఫొటోలను డీపీలుగా పెట్టుకోవద్దన్నారు. డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేనివారు డ్రైవింగ్‌ చేయవద్దని, ట్రాపిక్‌ రూల్స్‌ పాటించాలని సూచించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు సువర్ణ, ఏఎస్‌ఐ, సురేందర్‌ కానిస్టేబుల్‌ నాగేశ్వరరావు, హోంగార్డు శ్రీనివాసరావు, కళాబృందం ఇన్‌చార్జి యల్లయ్య, గోపయ్య, గురులింగం, క్రిష్ణ, చారి నాగార్జున, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 21 , 2024 | 11:58 PM