Share News

ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలి

ABN , Publish Date - Jun 09 , 2024 | 12:01 AM

విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని నేరేడుచర్ల జడ్పీటీసీ రాపోలు నర్సయ్య అన్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలి

నేరేడుచర్ల, జూన్‌ 8: విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని నేరేడుచర్ల జడ్పీటీసీ రాపోలు నర్సయ్య అన్నారు. ఎంఈవో ఛత్రునాయక్‌తో కలిసి ఆయన ప్రభుత్వం నుంచి వచ్చిన పుస్తకాలు, నోట్‌ పుస్తకాలను శనివారం ప్రధానోపాధ్యాయులకు అందజేశారు. బడీడు పిల్లలను బడిలో చేర్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు బాలు, సత్యనారాయణ, ఉపాధ్యాయులు శ్రీను, సత్యనారాయణ, నవీన్‌కుమార్‌, వీరారెడ్డి, సిబ్బంది ప్రతాప్‌, శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

తిరుమలగిరి రూరల్‌: బడిఈడు పిల్లలను బడికి పంపాలని జలాల్‌ పురం స్కూల్‌ కాంప్లెక్స్‌ హెడ్‌మాస్టర్‌ జి. అశోక్‌ అన్నారు. మండలంలోని జలాల్‌పురం గ్రామంలో శనివారం జరిగిన బడిబాట కార్యక్రమంలో మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు ఉచితంగా పాఠ్యపుస్తకాలు, మధ్యాహ్న భోజనం, పాఠశాల యూనిఫాం ప్రభుత్వం ఇస్తుందన్నారు. దీనిని ఉపయోగించుకొని చదువులో రాణించాలన్నారు. గ్రామాల్లో విద్యార్థులతో ర్యాలీలు నిర్వహించి, ఇంటింటి ప్రచారం చేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు వెంకటేశ్వర్లు, ఉమారాణి, షరీఫ్‌, రాములు, సత్యనారాయణ అంగన్‌వాడీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

మఠంపల్లి: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదును పెంచేం దుకు కృషి చేయాలని, బడి ఈడు పిల్లలను బడిలో చేర్పించాలని ఎంపీపీ ఎం. పార్వతి అన్నారు. మండలకేంద్రంలో శనివారం బడిబాట ర్యాలీని ప్రారంభి మాట్లాడుతూ పాఠశాలల్లో సకల సౌకర్యాలతో పాటు ప్రభుత్వం ఉచిత నాణ్యమైన విద్యను అందిస్తుందన్నారు. మండల వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాల హెచ్‌ఎంలు బడిబాట కార్యక్రమాన్ని నిర్వ హించారు. అనంతరం ప్రభుత్వం అందించిన పాఠ్య పుస్తకాలను ఎంఈవో ఛత్రు నాయక్‌ ఆధ్వర్యంలో పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.

పాలకవీడు: ప్రభుత్వం ఉచితంగా అందజేసిన పాఠ్యపుస్తకాలను శనివారం పాలకవీడులో ఎంపీపీ భూక్యాగోపాల్‌ ప్రధానోపాధ్యాయులకు అందజేశారు. కార్యక్రమంలో ఎంఈవో ఛత్రునాయక్‌, ప్రదానోపాధ్యాయులు శ్రీరాంరెడ్డి, వెంకటేశ్వరావు, వెంకటరెడ్డి, గోపాల్‌, నాగార్జున్‌, సంధ్యారాణి, సీఆర్పీలు వెంకటేశ్వర్లు, మంగ్తానాయక్‌, వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

నడిగూడెం: బడి బయట ఉన్న విద్యార్థులను బడిలో చేర్పించాలని కోరుతూ మండలంలోని కొత్త చాకిరాలలో బడిబాట కార్య క్రమం నిర్వహించారు. బడి బయటఉన్న పిల్లలను గుర్తించి ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో హెచ్‌ఎం. వెంకటేశ్వర్లు, ఉపాధ్యాయులు రవీందర్‌, రామారావు తదితరులు పాల్గొన్నారు.

మోతె: బడి ఈడు పిల్లలను బడులకు పంపించాలని సిరికొండ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు దామళ్ల కోటేశ్వరరావు అన్నారు. శనివారం మండల పరిధిలోని సిరికొండ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ఆధ్వర్యంలో గ్రామంలో ప్రొఫెసర్‌ జయశంకర్‌ బడి బాట కార్యక్రమంలో భాగంగా ఉపాధ్యాయులు, గ్రామస్థులు, విద్యార్థులతో కలిసి గ్రామంలో బడి ఈడు పిల్లలను బడులకు పంపించాలని ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాల్లో ప్రైవేట్‌ పాఠశాలలకు దీటుగా నాణ్యమైన విద్యను అందించడంతో పాటు విద్యార్దులకు అవసరమైన పుస్తకాలు, నోట్‌బుక్సు, యూనీఫాం ఉచితంగా అందజేస్తారని తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల యాజమాన్య కమిటీ సభ్యులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Updated Date - Jun 09 , 2024 | 12:01 AM