బియ్యపు గింజ పరిమాణంలో శివలింగం
ABN , Publish Date - Mar 08 , 2024 | 12:12 AM
: నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలం తిరుగండ్లపల్లికి చెందిన శివశంకరాచారి 40 మిల్లీగ్రాముల బంగారంతో బియ్యపు గింజ పరిమాణంలో శివలింగాన్ని తయారు చేశాడు.
మర్రిగూడ, మార్చి 7: నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలం తిరుగండ్లపల్లికి చెందిన శివశంకరాచారి 40 మిల్లీగ్రాముల బంగారంతో బియ్యపు గింజ పరిమాణంలో శివలింగాన్ని తయారు చేశాడు. నారోజు రామాచారి, వనమ్మ దంపతుల కుమారుడైన శివశంకరాచారి ఇంటర్మీడియెట్ వరకు చదివాడు. తండ్రి రామాచారి కార్పెంటర్ కాగా, కుమారుడు హైదరాబాద్‌లోని ఓ బంగారు ఆభరణాల తయారీ దుకాణంలో పనిచేసేవాడు. కరోనా సమయంలో స్వగ్రామంలో దుకాణాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. గతంలో ఆరు గ్రాముల బంగారంతో డబుల్‌బెడ్‌రూం ఇంటిని, బియ్యపు గింజ పరిమాణంలో జాతీయ జెండాను తయారుచేశాడు. శివరాత్రి పండుగను పురస్కరించుకుని 40మిల్లీగ్రాముల బంగారంతో గంట సమయంలో బియ్యపు గింజ పరిమాణంలో శివలింగాన్ని తయారుచేసి కుడిచేతి గోరుపై ఉంచి ప్రదర్శించారు. శివశంకరాచారి కళానైపుణ్యాన్ని స్థానికులు అభినందించారు.