Share News

శిశు మందిరాలు సంస్కృతి, సంప్రదాయాలకు నిలయాలు

ABN , Publish Date - Mar 01 , 2024 | 11:23 PM

శిశు మందిరాలు సంస్కృతి, సంప్రదాయాలకు నిల యాలు అని పుర చైర్‌పర్సన్‌ బాల్చెడ్‌ పావనీ, తెలంగాణ ప్రాంత ఉ పాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు షేర్‌ కృష్ణారెడ్డి అన్నారు.

శిశు మందిరాలు సంస్కృతి, సంప్రదాయాలకు నిలయాలు
నృత్యం చేస్తున్న శిశుమందిర్‌ విద్యార్థులు

- మునిసిపల్‌ చైర్మన్‌ బాల్చెడ్‌ పావనీ

మక్తల్‌, మార్చి 1: శిశు మందిరాలు సంస్కృతి, సంప్రదాయాలకు నిల యాలు అని పుర చైర్‌పర్సన్‌ బాల్చెడ్‌ పావనీ, తెలంగాణ ప్రాంత ఉ పాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు షేర్‌ కృష్ణారెడ్డి అన్నారు. శుక్రవారం ప ట్టణంలోని లయన్స్‌క్లబ్‌ భవనం వద్ద ఏర్పాటు చేసిన శిశుమందిర్‌ 39వ వా ర్షికోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. శిశుమందిరాల్లో చదు వుకునే విద్యార్థులు ప్రతి రంగంలో రాణిస్తారన్నారు. సంస్కారాలే పిల్లలకు తల్లిదండ్రులు ఇచ్చే ఆస్తులు అన్నారు. నిరంతరం చిన్నతనం నుంచి జాతీయ భావాలు, మన సంస్కృతిని అందించాలన్నారు. శిశుమందిర్‌లో చదివే పిల్లలు సంపూర్ణ వికాసం సాధిస్తారన్నారు. తల్లిదండ్రులు, గురువుల పట్ల సమాజంలో ఏవిధంగా మెలగాలో నేర్పించే సదాచారం చాలా అద్భుత మన్నారు. శిశుమందిరాలు విలువలతో కూడిన విద్య అందిస్తాయన్నారు. ఎం తటి ముఖ్యమైన పని ఉన్నప్పటికీ ప్రతీ రోజుల్లో కొంత సమయాన్ని పిల్లల తో కేటాయించడం వల్ల మంచి చెడులు నేర్చుకుంటారన్నారు. తల్లిదం డ్రులు రామాయణం, మహాభారతం వంటి గ్రంథాల నీతికథల సారాన్ని వి వరించాలన్నారు. అనంతరం శ్రీ సరస్వతీ శిశుమందిర్‌లో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో పాఠశాల అధ్య క్షుడు రఘుప్రసన్నభట్‌, గౌరవ అధ్యక్షులు మన్సాని వెంకటేష్‌, ప్రతాప్‌రెడ్డి, చిట్యాల ఆంజనేయులు, క్రిష్ణయ్య, శ్రీనివాసులు, వట్టం రతన్‌కుమార్‌గుప్తా, కావలి వెంకటేష్‌, ప్రధానోపాధ్యాయులు కురుమయ్య పాల్గొన్నారు.

Updated Date - Mar 01 , 2024 | 11:23 PM