Share News

శంషాబాద్‌- అయోధ్య విమాన సర్వీసు ప్రారంభం

ABN , Publish Date - Apr 03 , 2024 | 02:54 AM

రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి నేరుగా అయోధ్యకు వెళ్లే విమాన సర్వీసును

శంషాబాద్‌- అయోధ్య విమాన సర్వీసు ప్రారంభం

శంషాబాద్‌ రూరల్‌, ఏప్రిల్‌ 2 (ఆంధ్రజ్యోతి): రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి నేరుగా అయోధ్యకు వెళ్లే విమాన సర్వీసును ప్రారంభించినట్లు జీఎంఆర్‌ అధికారులు మంగళవారం వెల్లడించారు. ప్రతి మంగళ, గురు, శనివారాల్లో స్సైస్‌జెట్‌ ఎస్‌జీ611 విమానం ఉదయం 10.45 గంటలకు శంషాబాద్‌ విమానాశ్రయంలో బయలుదేరి మధ్యాహ్నం 12.45 గంటలకు అయోధ్య చేరుతుందని తెలిపారు. తిరుగు ప్రయాణంలో ఎస్‌జీ616 విమానం మధ్యాహ్నం 1.25 గంటలకు అయోధ్యలో బయలుదేరి మధ్యాహ్నం 3.25 గంటలకు శంషాబాద్‌ చేరుతుందని చెప్పారు. అయోధ్య సమీపంలోని పుణ్యక్షేత్రాలను సందర్శించాలనుకునే ప్రయాణికులకు ఈ నూతన సర్వీసు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, ఈ సర్వీసును ప్రారంభించడం ఎంతో సంతోషకరంగా ఉందని జీఎంఆర్‌ సీఈవో ప్రదీ్‌పఫణికర్‌ అన్నారు. స్సైస్‌జెట్‌ ఎయిర్‌లైన్స్‌ అధికారులు, జీఎంఆర్‌ ప్రతినిధులు మొదటి ప్రయాణికుడికి టికెట్‌ను అందజేశారు.

Updated Date - Apr 03 , 2024 | 08:03 AM