Share News

ఠాకూర్‌.. నోటీసులు నాక్కాదు కోమటిరెడ్డికి పంపండి

ABN , Publish Date - Feb 01 , 2024 | 03:40 AM

‘‘పరువు నష్టం నోటీసులు నాకు పంపడం కాదు.. మీ పార్టీనేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి పంపండి ఠాకూర్‌’’ అంటూ బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె.తారకరామారావు పేర్కొన్నారు. సిరిసిల్లలో తాను చేసిన ఆరోపణలకు తనపై పరువునష్టం

ఠాకూర్‌.. నోటీసులు నాక్కాదు కోమటిరెడ్డికి పంపండి

బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌

హైదరాబాద్‌, జనవరి 31(ఆంధ్రజ్యోతి): ‘‘పరువు నష్టం నోటీసులు నాకు పంపడం కాదు.. మీ పార్టీనేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి పంపండి ఠాకూర్‌’’ అంటూ బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె.తారకరామారావు పేర్కొన్నారు. సిరిసిల్లలో తాను చేసిన ఆరోపణలకు తనపై పరువునష్టం దావా వేస్తానని కాంగ్రెస్‌ తెలంగాణ మాజీ ఇన్‌చార్జ్‌ మాణికం ఠాకూర్‌ అనడంపై కేటీఆర్‌ బుధవారం ఎక్స్‌(ట్విటర్‌)లో స్పందించారు. ‘‘మాణికం గారు.. మీరు ఎందుకు అయోమయంలో ఎందుకు ఉన్నారు.. నోటీసులను తప్పుడు అడ్రె్‌సకు పంపిస్తున్నారు. పీసీసీ అధ్యక్ష పదవి కోసం రేవంత్‌రెడ్డి మీకు రూ.50 కోట్లు లంచం ఇచ్చారని మీపార్టీ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి గతంలో బహిరంగంగానే (ఆన్‌రికార్డ్‌) ఆరోపణలు చేశారు. ఆయన ఆ ఆరోపణలను ఇప్పటి దాకా వెనక్కి తీసుకోలేదు. వివరణ కూడా ఇవ్వలేదు. ఆయన చేసిన ఆరోపణలు నేను గుర్తు చేశాను. అలాంటప్పుడు మీరు పంపే నోటీసులు నా చిరునామాకు కాకుండా, సచివాలయంలో కూర్చున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి కార్యాలయానికి పంపించండి’’ అని కేటీఆర్‌ పేర్కొన్నారు.

Updated Date - Feb 01 , 2024 | 10:50 AM