Share News

లైసెన్స్‌ కలిగిన డీలర్లతోనే విత్తనాలు కొనాలి

ABN , Publish Date - May 25 , 2024 | 11:00 PM

వ్యవసాయశాఖ జారీ చేసిన లైసెన్స్‌ కలిగిన డీలర్తతోనే విత్తనా లు కొనుగోలు చేయాలని జిల్లా వ్యవసాయ అధి కారి చంద్రశేఖర్‌ శనివారం ఒక ప్రకటనలో తెలి పారు.

 లైసెన్స్‌ కలిగిన డీలర్లతోనే విత్తనాలు కొనాలి

- జిల్లా వ్యవసాయ అధికారి చంద్రశేఖర్‌

నాగర్‌కర్నూల్‌ టౌన్‌, మే 25: వ్యవసాయశాఖ జారీ చేసిన లైసెన్స్‌ కలిగిన డీలర్తతోనే విత్తనా లు కొనుగోలు చేయాలని జిల్లా వ్యవసాయ అధి కారి చంద్రశేఖర్‌ శనివారం ఒక ప్రకటనలో తెలి పారు. విత్తనాలు కొనుగోలు విషయంలో రైతు లు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఈ నెల 31 వరకు గ్రామాల్లో వ్యవసాయశాఖ అధికారులు రైతులకు అవగాహన సదస్సులు నిర్వహించను న్నట్లు పేర్కొన్నారు. డీలర్ల వద్ద విత్తనం కొను గోలు చేసే ముందు విత్తన కంపెనీ పేరు, విత్తన రకం, లాట్‌ నెంబరు, గడువు తేదీ, డీలరు సంతకం వంటి విషయాలు సరిచూసు కోవాలని సూచించారు. అలాగే లూజు విత్తనాలు, పగిలి న ప్యాకెట్లు, డబ్బాల విత్తనాలు కొనుగోలు చేయరాదని, విత్తన ప్యాకెట్లకు సీలు ఉందా, లేదా సరిచూసుకోవాలన్నారు. రైతులు నాణ్య మైన విత్తనాలను వాడి అధిక దిగుబడిని సా ధించాలని ఆకాంక్షించారు. లైసెన్స్‌ లేకుండా ఎ వరైనా గ్రామాల్లో తిరుగుతూ బిల్లులు లేకుండా విత్తనాలను అమ్మితే వెంటనే వ్యవసాయ అధి కారులకు సమాచారం ఇవ్వాలన్నారు. బీటీ -3గా పిలువబడే రకం విత్తనాలకు భారత ప్రభుత్వ అనుమతి లేదని, వాటి తయారీ, అమ్మకం ని షేధమన్నారు. నిషేధిత విత్తనాలను అమ్మ డం నేరమని, అమ్మితే వారితో పాటు కొన్నవారు కూ డా బాధ్యులవుతారని ఆయన హెచ్చరించారు.

Updated Date - May 25 , 2024 | 11:00 PM