Share News

రైతులకు అందుబాటులో విత్తనాలు, ఎరువులు

ABN , Publish Date - May 29 , 2024 | 11:01 PM

వర్షాకాలం ప్రారంభం అవుతున్నందున రైతులకు అవసరమైన అన్ని రకాల విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉం చామని కలెక్టర్‌ బీఎం సంతోష్‌ తెలిపారు.

 రైతులకు అందుబాటులో విత్తనాలు, ఎరువులు
కలెక్టర్‌ బీఎం సంతోష్‌

- కలెక్టర్‌ బీఎం సంతోష్‌

గద్వాల న్యూటౌన్‌, మే 29 : వర్షాకాలం ప్రారంభం అవుతున్నందున రైతులకు అవసరమైన అన్ని రకాల విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉం చామని కలెక్టర్‌ బీఎం సంతోష్‌ తెలిపారు. బుధవారం అధికారులతో ఆయన మాట్లాడుతూ రైతులకు వర్షాకాలంలో అవసరమైన 650 క్వింటాళ్ల జీలుగ వి త్తనాలు అందుబాటులో ఉంచా మన్నారు. ఇప్పటివరకు 381.9 క్వింటాళ్ల విత్తనాలు సరఫరా చేశామని, 91.8క్వింటాళ్ల జీలుగ అందుబాటులో ఉన్నాయని, ఇంకా 268.1 క్వింటాళ్ల విత్తనాలు సరఫరా చేస్తున్నామన్నారు. అదేవిధంగా రైతులకు కావాల్సిన పచ్చిరొట్ట ఎరువులు అందుబాటులో ఉంచామని రైతులెవ్వరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. పత్తిరైతులు బీసీ-2 హైబ్రీడ్‌ విత్తనాలు ఒకేవిధంగా పనిచేస్తాయని, ఒకే రకమైన కంపెనీ విత్తనాలు కాకుండా అందుబాటులో ఉన్న ఏ రకమైనా కంపెనీ విత్తనాలైనా కొనుగోలు చేసుకోవచ్చని ఆయన తెలిపారు. రైతులు విత్తనాలు కొనుగోలు చేసేవిషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. విడిగా ఉన్న సంచుల్లోని విత్తనాలను కొనుగోలు చేయవద్దని, ఆయా కంపెనీ లేబుల్‌ కలిగిన ప్యాకెట్లను కొనుగోలు చేయాలన్నారు. రైతులు విత్తనాలు కొనుగోలు చేసిన దుకాణం నుంచి రశీదును తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. వ్యవసాయశాఖ ద్వారా గుర్తింపు పొందిన డీలర్ల దగ్గర మాత్రమే విత్తనాలు కొనుగోలు చేయాలన్నారు. విత్తనాల ఖాళీ ప్యాకెట్లను, బిల్లులను పంటకాలం పూర్తయ్యే వరకు భద్రంగా ఉంచుకోవాలని తెలిపారు.

Updated Date - May 29 , 2024 | 11:01 PM