Share News

ప్రయాణికులకు ఇబ్బందుల్లేకుండా చూస్తా : ఎమ్మెల్యే జీఎంఆర్‌

ABN , Publish Date - Jan 05 , 2024 | 11:22 PM

వివిధ గ్రామాల ప్రయాణికులకు ఇబ్బందుల లేకుండా బస్సులు బస్టాండ్‌లోకి వచ్చేవిధంగా చూస్తానని స్థానిక ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి అన్నారు.

ప్రయాణికులకు ఇబ్బందుల్లేకుండా చూస్తా : ఎమ్మెల్యే జీఎంఆర్‌
అధికారులతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి

దేవరకద్ర, జనవరి 5 : వివిధ గ్రామాల ప్రయాణికులకు ఇబ్బందుల లేకుండా బస్సులు బస్టాండ్‌లోకి వచ్చేవిధంగా చూస్తానని స్థానిక ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని ఎమ్మెల్యే కాంపు కార్యాలయంలో ఆర్‌టీసీ, ఆర్‌అండ్‌బీ అధికారులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి ఆయన మాట్లాడారు. ఫ్లైఓవర్‌ బ్రిడ్జి నిర్మించిన తరువాత బస్సులు బస్టాండ్‌లోకి రాకపోవడంతో ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడుతున్నారని, అటు ఇటు రోడ్డుపై నిలబడి బస్సులు ఎక్కాల్సిన పరిస్థితి ఏర్పడిందని అధికారులు ఎమ్మెల్యేకు వివరించారు. వీరప్పయ్య కాంప్లెక్స్‌ దగ్గర బస్సులు తిప్పుకొని బస్టాండ్‌లోకి వచ్చేవిధంగా చూడాలని ఆర్‌టీసీ అధికారు లను కోరారు. ఆదేవిధంగా ఫ్లైఓవర్‌ బ్రిడ్జికి అటు ఇటు పక్కన సర్వీసు రోడ్డను వెంటనే ఏర్పాటు చేయాలని అధికారులకు ఎమ్మెల్యే సూచించారు. కార్యక్రమం లో టీపీసీసీ ఆర్గనైజింగ్‌ సెక్రటరి అరవింద్‌కుమార్‌రెడ్డి, మాజీ జడ్పీటీసీ లక్ష్మీ కాంత్‌రెడ్డి, మండల అధ్యక్షుడు అంజిల్‌రెడ్డి, రాఘవేందర్‌రెడ్డి, మండల నాయ కులు ఆది హన్మంతురెడ్డి, రఘవర్మ, అంజన్‌కుమార్‌రెడ్డి, వీరారెడ్డి, రామాంజ నేయులు, జోహర్‌, షారుక్‌, ఆర్టీసీ డీఎంసుజాత, అధికారులు పాల్గొన్నారు.

విద్య, వైద్యం అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది : ఎమ్మెల్యే

భూత్పూర్‌ : రాష్ట్రా ప్రభుత్వం విద్య, వైద్యాభివృద్ధికి కట్టుబడి ఉందని దేవరకద్ర నియోజకవర్గ ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మునిసి పాలిటీ పరిఽధిలోని అమిస్తాపూర్‌ గ్రామ శివారులో ఉన్న మహాత్మజ్యోతిబా ఫూలే పాఠశాలను ఎమ్మెల్యే సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్‌ బస్వరాజు ప్రభుత్వ పాఠశాలకు సొంత భవనం లేక పోవడంతో చాలా ఇబ్బందులు ఎదురువుతున్నాయని ప్రిన్సిపాల్‌ ఎమ్మెల్యేకు వినతి పత్రం అందించారు. అక్కడి నుంచి భూత్పూర్‌ హైస్కూల్‌ దగ్గర పీఆర్‌టీయూ నూతన సంవత్సరం క్యాలెండర్‌ను ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరై ఆవిష్కరించారు. కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు వెంకటనర్సిహారెడ్డి, పట్టణ అధ్యక్షుడు నవీన్‌గౌడ్‌, పీఆర్‌టీయూ సంఘం మండల అధ్యక్షుడు యాదయ్య, ప్రధాన కార్యదర్శి బాలరాజుగౌడ్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి రఘురాంరెడ్డి, స్కూల్‌ కాంప్లెక్స్‌ ప్రధానోపాధ్యాయురాలు, ఆనందమ్మ, ఉపాద్యాయులు లావణ్య, లక్ష్మీనారాయణ, రేవతి, పద్మవతి, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 05 , 2024 | 11:22 PM