Share News

ముగిసిన అదనపు ఈవీఎంల సెకండ్‌ ర్యాండమైజేషన్‌

ABN , Publish Date - May 08 , 2024 | 11:24 PM

చేవెళ్ల పార్లమెంట్‌ నియోజకవర్గానికి సంబంధించిన అదనపు ఈవీఎంల సెకండ్‌ ర్యాండమైజేషన్‌ బుధవారం ముగిసింది. ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి, కలెక్టర్‌ శశాంక నేతృత్వంలో సాధారణ పరిశీలకులు రాజేందర్‌ కుమార్‌ కటారియా, వ్యయ పరిశీలకులు రాజీవ్‌ చావ్రా సమక్షంలో అదనపు కంట్రోల్‌ యూనిట్లు, బ్యాలెట్‌ యూనిట్లు, వీవీ ప్యాట్ల రెండో విడత ర్యాండమైజేషన్‌ నిర్వహించారు.

ముగిసిన అదనపు ఈవీఎంల సెకండ్‌ ర్యాండమైజేషన్‌
మాట్లాడుతున్న జిల్లా ఎన్నికల అధికారి శశాంక

రంగారెడ్డి అర్బన్‌, మే 8 : చేవెళ్ల పార్లమెంట్‌ నియోజకవర్గానికి సంబంధించిన అదనపు ఈవీఎంల సెకండ్‌ ర్యాండమైజేషన్‌ బుధవారం ముగిసింది. ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి, కలెక్టర్‌ శశాంక నేతృత్వంలో సాధారణ పరిశీలకులు రాజేందర్‌ కుమార్‌ కటారియా, వ్యయ పరిశీలకులు రాజీవ్‌ చావ్రా సమక్షంలో అదనపు కంట్రోల్‌ యూనిట్లు, బ్యాలెట్‌ యూనిట్లు, వీవీ ప్యాట్ల రెండో విడత ర్యాండమైజేషన్‌ నిర్వహించారు. జిల్లా కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో నిర్వహించిన పరిగి, వికారాబాద్‌, తాండూర్‌ అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో కమిషనింగ్‌ సందర్భంగా సాంకేతిక సమస్యలు తలెత్తిన ఈవీఎంల స్థానంలో అదనంగా కేటాయించిన ఎలకా్ట్రనిక్‌ ఓటింగ్‌ యంత్రాలకు రెండో విడత సప్లిమెంటరీ ర్యాండమైజేషన్‌ నిర్వహించారు. ఈ ర్యాండమైజేషన్‌ ప్రక్రియలో గుర్తింపు పొందిన పార్టీల ప్రతినిధులు, ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు, వారి తరపున ప్రతినిధులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

10 వరకు పోస్టల్‌ బ్యాలెట్‌ సదుపాయం

ఈ నెల 10వరకు వీఎఫ్‌సీ సెంటర్లలో పోస్టల్‌ బ్యాలెట్‌ సదుపాయం కల్పించినట్లు జిల్లా ఎన్నికల అధికారి శశాంక తెలిపారు. పార్లమెంట్‌ ఎన్నికలకు సంబంధించి ఓటరు ఫెసిలిటేషన్‌ సెంటర్ల (వీ.ఎఫ్‌.సి) ద్వారా పోస్టల్‌ బ్యాలెట్‌ను వినియోగించుకునేందుకు వీలుగా ఎన్నికల సంఘం ఈ నెల 10వ తేది వరకు గడువును పొడిగించిందని కలెక్టర్‌ శశాంక తెలిపారు. వాస్తవానికి బుధవారంగడువు ముగియగా, ఈసీ మరో రెండు రోజుల పాటు గడువు పొడిగించిందని చెప్పారు. ఎన్నికల విధులలో పాల్గొంటున్న సిబ్బంది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ సూచించారు.

16,088 పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటు వినియోగం

చేవెళ్ల పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలో ఈ నెల 7వ తేదీ (మంగళవారం సాయంత్రం) వరకు 16,088 మంది పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని కలెక్టర్‌ తెలిపారు. చేవెళ్ల పార్లమెంటు సెగ్మెంట్‌ పరిధిలో 1,115 మంది 85 సంవత్సరాలకు పైబడిన సీనియర్‌ సిటిజన్లు, దివ్యాంగులు ఓట్‌ఫ్రంహోమ్‌లో భాగంగా ఇంటి నుండే ఓటు హక్కును వినియోగించుకునేందుకు వీలుగా దరఖాస్తులు చేసుకున్నారు. వారిలో 994 మంది ఓటుహక్కు వినియోగించుకున్నట్టు కలెక్టర్‌ శశాంక తెలిపారు.

============================================

Updated Date - May 08 , 2024 | 11:24 PM