Share News

‘పెండ్లిపాకల’ ముంపు బాధితుల వినతుల పరిశీలన

ABN , Publish Date - Apr 25 , 2024 | 11:39 PM

పెండ్లిపాకల రిజర్వాయర్‌ ముంపు బాధితుల వినతులను గురువారం ప్రత్యే క డిప్యూటీ కలెక్టర్‌ నీల పరిశీలించారు.

 ‘పెండ్లిపాకల’ ముంపు  బాధితుల వినతుల పరిశీలన
వినతిపత్రాలను పరిశీలిస్తున్న డిప్యూటీ కలెక్టర్‌ నీల

‘పెండ్లిపాకల’ ముంపు బాధితుల వినతుల పరిశీలన

కొండమల్లేపల్లి, ఏప్రిల్‌ 25: పెండ్లిపాకల రిజర్వాయర్‌ ముంపు బాధితుల వినతులను గురువారం ప్రత్యే క డిప్యూటీ కలెక్టర్‌ నీల పరిశీలించారు. గురువారం మం డలంలోని గాజీనగర్‌ గ్రామపంచాయతీ కార్యాలయంలో పెండ్లిపాకల రిజర్వాయర్‌ ముంపు బాధితుల నుంచి స్వీ కరించిన దరఖాస్తులను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నికల కోడ్‌కు సంబంఽధం లేకుండా విధి నిర్వహణలో భాగంగానే ముంపు బాధితుల వినతులను పరిశీలించినట్లు తెలిపారు. 109 ఎకరాలకు సంబంధించి ముంపు బాధితుల నుంచి వచ్చిన వి నతులను పరిశీలించినట్లు ఆమె పేర్కొన్నారు. ఆమె వెం ట ఆర్‌ఐ అశ్విని, జూనియర్‌ అసిస్టెంట్‌ శ్రీనివాస్‌, పంచాయతీ కార్యదర్శి గుండాల వెంకటయ్య తదితరులు ఉన్నా రు. ఇదిలా ఉంటే ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్న సమయం లో ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్‌ విధి నిర్వహణలో భాగంగా రావడంపై పలువురు రాజకీయ ఒత్తిళ్లు లేదా ఇతర కారణాలు ఉంటాయనే కోణంలో చర్చించుకుంటున్నారు.

Updated Date - Apr 25 , 2024 | 11:39 PM