Share News

సీటీవోల అధికారాలకు కత్తెర

ABN , Publish Date - May 07 , 2024 | 06:01 AM

వస్తుసేవల పన్ను(జీఎస్టీ) రిఫండ్‌ విషయంలో అవకతవకలు చోటు చేసుకున్న నేపథ్యంలో వాణిజ్య పన్నుల కమిషనరేట్‌ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. కమర్షియల్‌ ట్యాక్స్‌ ఆఫీసర్స్‌(సీటీవో)కు ఉన్న అపరిమిత అధికారాలకు కత్తెర వేసింది. రిఫండ్‌పై వారికున్న

సీటీవోల అధికారాలకు కత్తెర

రూ.లక్షలోపు జీఎస్టీ రిఫండ్‌

పరిశీలనకే పరిమితం

రూ.కోటిపైన బాధ్యతలు కమిషనర్‌కు

‘ఐటీసీ’లలో అక్రమాల నేపథ్యంలో

వాణిజ్య పన్నుల శాఖ దిద్దుబాటు చర్యలు

హైదరాబాద్‌, మే 6 (ఆంధ్రజ్యోతి): వస్తుసేవల పన్ను(జీఎస్టీ) రిఫండ్‌ విషయంలో అవకతవకలు చోటు చేసుకున్న నేపథ్యంలో వాణిజ్య పన్నుల కమిషనరేట్‌ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. కమర్షియల్‌ ట్యాక్స్‌ ఆఫీసర్స్‌(సీటీవో)కు ఉన్న అపరిమిత అధికారాలకు కత్తెర వేసింది. రిఫండ్‌పై వారికున్న స్ర్కూటినీ పరిమితిని తగ్గించింది. నకిలీ ఇన్వాయిస్‌ లు సృష్టించి వివర్ధ ఆటోమొబైల్స్‌ ఎండీ వేమిరెడ్డి రాజా రమే్‌షరెడ్డి రూ.23.78కోట్ల ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌(ఐటీసీ)ను క్లెయిమ్‌ చేసినట్లు స్టేట్‌ ట్యాక్స్‌ అధికారులు గుర్తించారు. ఈమేరకు ఆయనపై nఫిర్యాదు చేయగా...సీసీఎస్‌ పోలీసులు అరెస్టు చేశారు. ఈ రీఫండ్‌ పొందడానికి తాను అధికారులకు లంచాలు ఇచ్చినట్లు రాజా రమే్‌షరెడ్డి వెల్లడించడంతో ఒక డిప్యూటీ కమిషనర్‌, ఇద్దరు అసిస్టెంట్‌ కమిషనర్లు, ఒక సీటీవోను పోలీసులు అరెస్టు చేశారు. ఇది రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖలో పెను సంచలనం సృష్టించింది. పన్ను వసూళ్లలో లీకేజీలు లేకుండా చూడాల్సిన అధికారులే అక్రమాలకు తెరలేపడం చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్‌ టీకే శ్రీదేవి దిద్దుబాటు చర్యలు చేపడుతూ అంతర్గత సర్క్యులర్‌ను జారీ చేశారు. జీఎస్టీ రీఫండ్‌కు సంబంధించి రూ.లక్షలోపు ఉన్న క్లెయిమ్‌లను మాత్రమే సీటీవోలు పరిశీలించాలని ఆదేశించారు. రూ.లక్ష నుంచి రూ.కోటి వరకు క్లెయిమ్‌లను పరిష్కరించే బాధ్యత జాయింట్‌ కమిషనర్లకు అప్పగించారు. ఇక, రూ.కోటిపైన ఉండే రీఫండ్‌ దరఖాస్తులన్నింటినీ కమిషనర్‌ వద్దకు పంపాలని సూచించారు. ఈ చర్యలతో రీఫండ్‌లో అక్రమాలకు కొంతైనా తగ్గే అవకాశాలుంటాయని భావిస్తున్నారు.

Updated Date - May 07 , 2024 | 06:01 AM